రామ్ చరణ్ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో ఓ మాస్ ఎంటర్టైనర్ సినిమా వస్తున్నట్టు మనకి తెలిసిన విషయమే. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను రామ్ చరణ్ లేకుండా పూర్తి చేశారు. ఈనెల 6వ తేదీ నుండి రెండో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ లో గచ్చిబౌలి దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చరణ్, మరికొంతమంది ఆర్టిస్ట్ లపై చిత్రీకరించనున్నారు.
అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికంగా తీసుకోనున్నట్టు వినికిడి. ఈ సినిమాకి ముందు వరకు బోయపాటి 10 కోట్లు తీసుకునేవాడు. అయితే ఈ సినిమాతో ఒకేసారి 5 కోట్లు పెంచేసాడు. టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళిని పక్కన పెడితే.. పారితోషికం విషయంలో త్రివిక్రమ్..కొరటాల శివ సరసన తాజాగా బోయపాటి కూడా చేరిపోయాడని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ దానయ్య బోయపాటి అడిగినంత ఇవ్వటానికి ఓకే అన్నారంట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ న్యూ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే.