నిజానికి చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరికీ కేంద్రంతో తగవు పెట్టుకోవాలన్నా, గట్టిగా ప్రస్తావించాలన్నా వారిపై ఉన్న అవినీతికేసులు మూలంగా కేంద్రంలోని బిజెపి ఎదుట సాగిలపడుతున్నారు. అంతేగానీ ఓ కేజ్రీవాల్‌గా, మమతా బెనర్జీ వంటివారి వలే కేంద్రాన్ని నిలదీయకుండా ముందుకు సాగలేకపోతున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ, ఏపీ, తమిళనాడు. కర్ణాటక, కేరళ,పుదుచ్చేరిలలోని కొందరు నాయకులతో కలసి దక్షిణాదిపై సవతి తల్లి ప్రేమను చూపుతోన్న ఉత్తరాది పార్టీ బిజెపిపై రాజకీయంగా బలపడాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఒక్క కర్ణాటకలో తప్పితే మిగిలిన ఐదు దక్షిణాది రాష్ట్రాలలో బిజెపికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. తద్వారా రజనీకాంత్, కమల్‌హాసన్, ఉపేంద్ర, పవన్‌కళ్యాణ్ వంటి వారు దక్షిణాది గళం వినిపించేందుకు సిద్దమవుతున్నారు. వీరికి వామపక్షాలు కూడా తోడైతే కేంద్రంలో హంగ్ రావడం, వీలుంటే తృతీయ ప్రత్యామ్నయం మరలా బలపడే అవకాశాలున్నాయి.
ఇక చంద్రబాబు చూస్తే ఒక ఏడాది కూడా లేని ఎలక్షన్ల సమయంలో చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం అంటున్నాడు. అవిశ్వాసం పెట్టి ఓడిపోతే మరో ఆరునెలలు అవిశ్వాసం పెట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఏడాదిలో రానున్న ఎలక్షన్ల సమయంలో అవిశ్వాసం, మంత్రులు, ఎంపీల చేత రాజీనామా చేయిస్తే అది మంచి పరిణామంగా మారుతుంది. ఇక జగన్ అయితే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేసి కేంద్రంలో బిజెపికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో పోరాటానికి రెడీ అయ్యాడు. వైసీపీ ఇప్పుడు కూడా ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో రాష్ట్రంలోని టిడిపిని డిమాండ్ చేస్తోందే గానీ కేంద్రాన్ని ఒక విషయంలో కూడా విమర్శించలేకున్నాడు. ఈ స్థితిలో త్వరలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మరో ముందడుగు వేస్తున్నాడు.
ఆయన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట దీక్ష చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన జెఎఫ్‌సి తుది నిర్ణయం కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. రిపోర్ట్ కూడా వచ్చేసింది. అందులో కేంద్రం, టీడీపీ కలిసి నటిస్తున్నాయనే రిపోర్ట్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఢీల్లీ వెళ్లి పార్లమెంట్ సమావేశాల సమయంలో ధర్నా చేయడమే కాదు.. మిగిలిన విపక్షాలతో మంతనాలు సాగించి, ఏపీ ప్రత్యేకహోదా విషయంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టనున్నాడట పవన్. రాష్ట్రం తన వాదనను ఇప్పటికే ఓ నివేదిక రూపంలో ఇచ్చింది. ఇక కేంద్రం ఎంత ఆర్ధికసాయాలు ఏపీకి చేయనుందనే విషయంలో సమాచార హక్కు చట్టం కింద కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువగా అయ్యాయని, ఓపార్టీ తనపై కుల ముద్ర వేయాడానికి ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించడంతో అది వైసీపీనే అని తేటతెల్లమవుతోంది....!