Advertisementt

మాటల మాంత్రికుడితో నానినా..?

Fri 02nd Mar 2018 12:48 PM
nani,trivikram srinivas,movie,venkatesh,ntr  మాటల మాంత్రికుడితో నానినా..?
Nani To Work With Trivikram Srinivas మాటల మాంత్రికుడితో నానినా..?
Advertisement
Ads by CJ

నేచురల్‌ స్టార్‌గా ఎదిగిన నాని తన కెరీర్‌లో వరుసగా ఎవ్వరూ ఊహించలేని రీతిలో డబుల్‌ హ్యాట్రిక్‌ నుంటి ట్రిపుల్‌ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నాడు. కానీ ఇటీవల వచ్చిన 'ఎంసీఏ' చిత్రం కమర్షియల్‌గా సక్సెస్‌ అయినప్పటికీ నాని మరీ ఒకే తరహా చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక ప్రస్తుతం నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తూ 'కృష్ణార్జున యుద్దం' చేస్తున్నాడు. ఈ చిత్రం వేసవికి విడుదల కానుంది. దీని తర్వాత ఆయన శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. ఇందులో నాగార్జున మాజీ డాన్‌గా కనిపిస్తూ, డాక్టర్‌ అయిన నాని జీవితంలో ఎదురైన ఓ సంఘటనతో ఆయనకు సహాయం చేసేందుకు మరలా డాన్‌లా మారుతాడనే మాట వినిపిస్తోంది. 

ఇక ఇందులో నాని సరసన మాళవిక అయ్యర్‌, నాగార్జున సరసన శ్రద్దాశ్రీనాధ్‌లు నటించనున్నారు. నాని కిషోర్‌ తిరుమలకి ఓకే చెప్పి కూడా 'ఎంసీఏ' విమర్శల రీత్యా రొటీన్‌గా ఉండే ఈ చిత్రం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక నాని త్వరలో నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. వీటన్నింటినీ పక్కన పెడితే వచ్చేనెలలోనే నాగ్‌ 'ఆఫీసర్‌' చిత్రం పూర్తవుతుంది. నాని కూడా 'కృష్ణార్జున యుద్దం' పూర్తి చేయనున్నాడు. మరి వీరిద్దరి కలయిక చిత్రం తర్వాత నాని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. ఇప్పటివరకు నాని స్టార్‌ డైరెక్టర్స్‌తో చిత్రాలు చేయలేదు. కొత్త, యంగ్‌ టాలెంటెడ్‌ దర్శకులతోనే పనిచేసి విజయాలు అందుకుంటున్నాడు. అలాంటి నాని త్రివిక్రమ్‌ చిత్రంలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఈచిత్రం కూడా 'అత్తారింటికి దారేది, ఆ..ఆ'ల తరహాలో ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని సమాచారం. ఇక ఫ్యామిలీ చిత్రాలంటే నాని ఓ రేంజ్‌లో కుమ్మేస్తాడు. ఈ చిత్రం ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌, వెంకటేష్‌ల తర్వాత వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ప్రారంభం కానుంది. ఇక 'అజ్ఞావాసి' వంటి డిజాస్టర్స్‌ తర్వాత కూడా ఎన్టీఆర్‌, వెంకటేష్‌, నాని వంటి వారు త్రివిక్రమ్‌తో చేయడానికి ఉత్సాహం చూపిస్తుండటం విశేషమే మరి. వారికి త్రివిక్రమ్‌పై ఉన్న నమ్మకం అలాంటిది.

Nani To Work With Trivikram Srinivas:

Actor Nani to team up with Trivikram Srinivas soon?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ