దాదాపు 18ఏళ్లుగా కెరీర్‌ని సాగిస్తూ, 35 ఏళ్ల వయసులో కూడా కుర్రహీరోలకే కాదు. సీనియర్ స్టార్స్‌కి కూడా శ్రియ బెస్ట్ చాయిస్‌గా మారుతోంది. 'గౌతమీ పుత్ర శాతకర్ని, పైసావసూల్' చిత్రాలలో బాలకృష్ణతో, 'ఊపిరి' చిత్రంలో నాగార్జునతో, 'గాయత్రి' చిత్రంలో మంచు విష్ణుకి జోడీగా నటించిది. ఇక శ్రియ ఆల్‌రెడీ ఇప్పటికే స్టార్స్‌తో కొన్ని చిత్రాలు చేసింది. ఆ మద్య వచ్చిన 'గోపాల గోపాల'లో కూడా వెంకీకి జోడీగా కనిపించింది. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం తేజా దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై 'ఆటానాదే.. వేటా నాదే' అనే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏ జోనర్ సినిమా అనేది తెలియకపోయినా ఇందులో వెంకీ కాలేజీ లెక్చరర్ పాత్రను చేస్తున్నాడట.
ఇక ఇందులో నారా రోహిత్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. తేజ మరలా గాడిలో పడిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో రానా సరసన కాజల్ నటించింది. దాంతో ఇందులో కూడా కాజల్‌నే పెట్టుకోవాలని భావించారు. కానీ ఆమె ఆ చిత్రం సంగతి వేరు ఇందులో నటించాలంటే మాత్రం కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో ఈ చిత్రం ఆ స్థాయి భారీ చిత్రం కాదని భావించి అందులో సగం పారితోషికానికి అంటే 50 నుంచి 60లక్షల లోపే శ్రియ తీసుకుంటోందంటే ఆమె నిర్మాతల హీరోయిన్ అని చెప్పాలి.