'సాక్ష్యం' సినిమాకు భారీ ఆఫర్!

Saakshyam Super Record

బెల్లంకొండ శ్రీనివాస్ - పూజ హెగ్డే కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'సాక్ష్యం' సినిమాకి అన్ని భలే కలిసొస్తున్నాయి. ఆల్రెడీ హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ హక్కులు మొత్తంగా ౮ కోట్లకు అమ్ముడు పోయాయి. తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ అయిదున్నర కోట్లకు అమ్ముడు అయిపోయిందంట. దీంతో థియేట్రికల్ రైట్స్ కాకుండా పదమూడు కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

శ్రీవాస్ డైరెక్షన్ లో తొలిసారి నటిస్తున్న శ్రీనివాస్ ఈ సినిమాలో చాలానే కష్టపడ్డాడంట. ఈ మూవీలో 5  భారీ ఫైట్స్ వున్నాయి. మాంచి కమర్షియల్ హంగులు వుంటాయి. ఇప్పటి వరకు అయిన రష్ చూసిన జీ సినిమాస్ వారు ఈ మంచి రేటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. మే రెండో వారంలో రావటానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు.

అయితే ఈ సినిమాకు ముందు వారమే అల్లు అర్జున్ నాపేరు సూర్యతో వస్తున్నాడు.  సాక్ష్యం మే రెండో వారం కాకుండా మూడో వారంకి వెళ్లే ఛాన్స్ వుంది. లేదా వారం గ్యాప్ తో ఇద్దరు వస్తారేమో చూడాలి.

Saakshyam Satellite Rights Huge Price

bellamkonda sai srinivas
pooja hegde
saakshyam movie
satelite rights