సీఎం చంద్రబాబునాయుడు అంటే పడని వారు కూడా ఆయన అంకిత భావం పట్ల మెచ్చుకోలుగానే మాట్లాడుతారు. క్రమశిక్షణతో కూడిన రాజకీయ జీవితం ఆయనది. ఇక ఏదైనా పని మొదలుపెడితే పూర్తయ్యే వరకు వెనుదిరగడు. ఇక ఈయనకు సోరియాసిస్ ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఈయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. క్రమశిక్షణ అలవరచడానికి యోగా మంచిదని భావించి, నాడు యోగా పట్ల పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపని రోజుల్లో ఈయన ప్రతిరోజు తన ప్రభుత్వంలోని మంత్రులు ఖచ్చితంగా యోగా, ధ్యానం వంటి వాటిని తప్పని సరిగా చేయాలని ఆదేశించారు. ఇక ఈయన రాజకీయాలలోకి ప్రవేశించి 40ఏళ్లు అయిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సినిమాలు చూడటం నాకు చిన్ననాటి నుంచి ఇష్టం లేదు. అయితే 'బాహుబలి' చిత్రాన్ని మాత్రం నా ఇంటిలోని హోమ్ థియేటర్‌లోనే చూశాను. మల్టీప్లెక్స్‌లకి వెళ్లి సినిమాలు చూసే అలవాటు నాకు లేదు.
ఇక నేను ఎక్కువగా ఇంటి భోజనం చేస్తానే గానీ హోటల్ తిండి తినను. ఇక విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మాత్రం అక్కడ హోటల్స్‌లో భోజనం చేయడం తప్పదు. ఇక నేను 16ఏళ్ల వయసులో ప్రతి విషయాన్ని ఎంతో తేలికగా తీసుకునే వాడినని, అందువల్లే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫెయిలయ్యాను. తర్వాత తిరుపతికి చదువు కోసం వచ్చిన తర్వాత మాత్రం నాకు అన్ని విజయాలే వచ్చాయన్నారు. ఇక చంద్రబాబు నాడు పలు చిత్రాలు, శంకర్ తీసిన 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాల ప్రీమియర్ షోలు కూడా చూశాడు. నాడు ఆయన తన మామయ్య ఎన్టీఆర్ నటించిన ప్రతి చిత్రాన్ని చూసేవాడినని, ఆ విధంగానే ఎన్టీఆర్ అంటే తనకు అభిమానం ఏర్పడిందని కొన్నేళ్ల కిందట చెప్పేవారు.
ఇక ఈయన ఏవీఎస్, మురళీమోహన్, ఈవీవీ సత్యనారాయణ, రాజమౌళి, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు వంటి వారికి ఎంతో సన్నిహితుడే కాదు.. వారి చేత ఎన్నికల వేళ, ఇతర సందర్భాలలో ఆయన టిడిపికి ఓటేయమని చెప్పే ప్రకటనల రూపకల్పనను ఆయా వ్యక్తులకే అప్పగించేవారు. ఇక ఈయన పార్టీలో చిన్నస్థాయి నటీనటులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం తనకు సినిమాలు చూసే అలవాటు లేదని చెప్పడం కాస్త అతిశయోక్తిగానే ఉంది.