Advertisementt

జాన్వీ కపూర్ తట్టుకోలేక తల్లడిల్లుతోంది!

Thu 01st Mar 2018 01:06 PM
jhanvi kapoor,sridevi death,dhadak,sridevi legacy  జాన్వీ కపూర్ తట్టుకోలేక తల్లడిల్లుతోంది!
Jhanvi Kapoor's Condition After Mom Sridevi's Demise జాన్వీ కపూర్ తట్టుకోలేక తల్లడిల్లుతోంది!
Advertisement
Ads by CJ

ఎప్పుడూ తల్లి చాటు బిడ్డగానే బయట ప్రపంచానికి పరిచయం అయిన జాన్వీ కపూర్ ఇప్పుడు తల్లి శ్రీదేవి మరణంతో ఒంటరిదైపోయింది. తన తల్లితో పలు ఫంక్షన్స్ కి అలాగే.. పార్టీలకు, చివరికి బ్యూటీ పార్లల్ కి వెళ్లాలన్నా తన తల్లితో కలిసి వెళ్లే జాన్వీ కపూర్ ఇప్పుడు తన తల్లి లేదనే చేదు నిజాన్ని తట్టులేక తల్లడిల్లుతోంది. శ్రీదేవి ఎప్పుడూ తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ ని వెండితెరకు పరిచయం చెయ్యాలని కలలు కనే క్రమంలో జాన్వికి అటు యాక్టింగ్ లోను, ఇటు డాన్స్ లోను అన్నిటిలో తగిన శిక్షణ ఇప్పించి మరీ... ఆమెను వెండితెరకు పరిచయం చెయ్యడానికి డిసైడ్ అయ్యి బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ చేతుల్లో పెట్టింది. కరణ్ జోహార్ జాన్వీ కపూర్ ని దఢక్ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయం చేస్తున్నాడు. 

మరి శ్రీదేవి తన కూతుర్ని వెండితెర మీద చూడకుండానే కన్ను మూయడం అత్యంత బాధాకరం. మరి అన్నిటిలో తల్లిచాటు బిడ్డగా పెరిగిన జాన్వీ కపూర్ ఇప్పుడు తన తల్లి బాధ్యతలను మోయగలుగుతుందా? ఆమె తల్లి శ్రీదేవిలా ఒంటరిగా పోరాడి మంచి పేరు తెచ్చుకుంటుందా? అనేది ఆమె మొదటి సినిమా ధఢక్ విడుదల తర్వాతే తెలుస్తుంది. కానీ కూతురు ఎదుగుదలను చూడకుండానే శ్రీదేవి ఇలా కన్ను మూయడం మాత్రం జాన్వీ జీవితంలోనే మరిచిపోలేని అత్యంత బాధాకర విషయం. 

Jhanvi Kapoor's Condition After Mom Sridevi's Demise:

With Jhanvi Kapoor making her movie debut with Dharma Productions Dhadak, expectations are already high that Sridevi’s legacy will live on through her daughter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ