రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా? అంటే ఏమో నిజమేనేమో.. షూటింగ్ ఇంకా పూర్తి అయ్యి ఉండదు. అందుకే రామ్ చరణ్ ఇంకా చిట్టి బాబు లుక్ లోనే ఉన్నాడు. ఈ మధ్యన రామ్ చరణ్, బోయపాటి సినిమా షూటింగ్ లో జాయిన్ కావడానికి గాను తన లుక్ మారుస్తున్నాడని... అలాగే రామ్ చరణ్ తన హెయిర్ స్టయిల్ ని మార్చే లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఇక రామ్ చరణ్ హెయిర్ స్టయిల్ తో పాటే రంగస్థలంలోని చిట్టిబాబు గెడ్డం లుక్ ని కూడా మార్చేసి బోయపాటి సినిమా కోసం పూర్తిగా సిద్దమవుతున్నాడు అంటూ అనేకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
మరి సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ - సమంత జంటగా తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ దాదాపు పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం రెడీ అవుతుందని అన్నారు. ఇక సుకుమార్ సినిమాకి ప్యాకప్ చెప్పేసి రామ్ చరణ్.. బోయపాటి సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం సిద్దమవుతున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ ని చూస్తుంటే... మాత్రం ఇంకా రామ్ చరణ్ చిట్టిబాబు లుక్ లోనే అంటే ఇంకా గెడ్డం లుక్ లోనే కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ భార్య తన భర్త రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన డ్రెస్ కలర్, చరణ్ డ్రెస్ కలర్ సేమ్ టు సేమ్ అంటూనే ఇది ఫ్యామిలీ టైం అంటూ ఒక పిక్ ని పోస్ట్ చేసింది.
ఆ పిక్ లో రామ్ చరణ్ ఇంకా చిట్టిబాబు లుక్ లోనే ఉండి షాక్ ఇచ్చాడు. అంటే రంగస్థలం షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందా? లేదంటే బోయపాటి సినిమాలో కూడా రామ్ చరణ్ అదే లుక్ లో కనిపిస్తాడా? అనే డౌట్ లో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఈ పాటికే బోయపాటి - చరణ్ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కావాలి. కానీ అవ్వలేదు. మరోపక్క రంగస్థలం సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోతే... మార్చి 30 న సినిమాని ఎలా విడుదల చేస్తారు. అసలు సుకుమార్ దాదాపు ఏడాది నుండి రంగస్థలం ని పర్ఫెక్షన్ కోసం చెక్కుతూనే ఉన్నాడు. ఇంకా చెక్కి చెక్కి సినిమాని మార్చి లో అయినా విడుదల చేస్తాడా లేదంటే.. అంటూ అనుమానంలో ఇప్పుడు ప్రేక్షకులు ఉన్నారు.