Advertisementt

సాయి పల్లవి గొడవేం జరగలేదంటోంది!

Wed 28th Feb 2018 10:56 PM
sai pallavi,naga shourya,allegations,respond  సాయి పల్లవి గొడవేం జరగలేదంటోంది!
Sai Pallavi finally responds to Naga Shaurya’s Allegations సాయి పల్లవి గొడవేం జరగలేదంటోంది!
Advertisement
Ads by CJ

సినిమా షూటింగ్ టైంలో హీరో - హీరోయిన్స్ కి మధ్య చిన్న పాటి విభేదాలు తలెత్తడం మామూలే. అవి ఆ సినిమా అయ్యేలోపు సెటిల్ చేసుకుంటారు చాలా మంది. అలా కాదని మీడియా దాకా ఆ గొడవ తీసుకొస్తే వేరేలా ఉంటది. ‘కణం’ సినిమా షూటింగ్ సందర్భంగా హీరో నాగశౌర్య, హీరోయిన్ సాయిపల్లవి మధ్య గొడవ అలాంటిదే అనుకున్నారు చాలామంది.

ఇటీవల ఓ టీవీ ప్రోగ్రామ్ కి వచ్చిన శౌర్యని మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన నటి ఎవరంటే.. ఏం ఆలోచించకుండా సాయి పల్లవి పేరు చెప్పాడు. అంతే కాక మరొక  ఇంటర్వ్యూ సాయి పల్లవి వల్ల ఇబ్బంది ఎదురైనట్లు కుండబద్దలు కొట్టేశాడతను. అయితే ఈ విషయం గురించి సాయి పల్లవి స్పందించింది. నాగ శౌర్య ఇంటర్వ్యూ చదివానని.. వెంటనే డైరెక్టర్ విజయ్ కి కాల్ చేసి అడిగానని.. విజయ్ మాత్రం దీని గురించి తనకు ఏ సమాచారం లేదని.. షూటింగ్ టైంలో ఇబ్బందికరంగా ఏమీ జరగలేదని స్పష్టం చేశాడని సాయిపల్లవి తెలిపింది.

సినిమాటోగ్రాఫర్ కూడా ఇదే మాట అన్నాడని చెప్పింది. తన గురించి వేరేవారు నా దగ్గరకి  వచ్చి ఇలాంటి మాట చెబితే తనకు కచ్చితంగా బాధగా ఉంటుందని ఆమె చెప్పింది. తానైతే ఎవరిని హర్ట్ చేయలేదని చెప్పింది. ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే డైరెక్టర్ తో చెప్పాల్సిందని.. అప్పుడే ఏ ఇబ్బందీ లేకుండా షూటింగ్ సాగుతుందని చెప్పింది. ఇవన్నీ చెప్పిన సాయిపల్లవి.. చివరగా శౌర్య మంచి నటుడంటూ కితాబిచ్చి ముగించడం విశేషం.

Sai Pallavi finally responds to Naga Shaurya’s Allegations:

Sai Pallavi finally responds to Naga Shaurya's 'tantrums' allegations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ