Advertisementt

తొలిప్రేమ హవా.. అస్సలు తగ్గలే..!

Wed 28th Feb 2018 10:19 PM
tholiprema,collections,25 crores,varun tej,raashi khanna  తొలిప్రేమ హవా.. అస్సలు తగ్గలే..!
Tholiprema Magic Continues తొలిప్రేమ హవా.. అస్సలు తగ్గలే..!
Advertisement
Ads by CJ

‘అ!’ సినిమా విడుదలై రెండు వారాల పైన అవుతుంది. పెట్టుబడిని అయితే వెనక్కి తెచ్చుకుంది కానీ మామూలుగా చూస్తే దాని వసూళ్లు అంత గొప్పగా ఏమీ లేవు. పెద్ద ఎత్తున థియేటర్స్ లోకి జనాలని రప్పించలేకపోతోంది. ‘అ!’ సినిమాకి వారం ముందు  వచ్చిన 'తొలిప్రేమ' ఇప్పటికి కూడా దాని హవా కొనసాగిస్తోంది.

ఈ వారం వచ్చిన సినిమాలు అన్ని తుస్ అనడంతో 'తొలిప్రేమ'కు బాగా కలిసొచ్చింది. రిలీజ్ అయిన రోజు నుండి అదే బాక్సాఫీస్ లీడర్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. అమెరికాలో ఎక్కువ వసూళ్లు రాబడుతున్నది ‘తొలిప్రేమ’ చిత్రమే. మూడో వారంలోనూ ఈ సినిమా బాగా ఆడడంతో థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి.

ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమా...మిగతా సినిమాలన్నీ కలిపి ఎంత వసూళ్లు రాబట్టాయో.. దాదాపుగా అంతే స్థాయిలో ‘తొలిప్రేమ’ కలెక్షన్లు ఉండటం విశేషం. వీకెండ్లో ఈ సినిమా అడుతున్న థియేటర్స్ లో 60-70 శాతం సీట్స్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే దీని కలెక్షన్స్ దాదాపు రూ.25 కోట్లు దాటింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.30 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

Tholiprema Magic Continues:

Tholiprema collections Reached 25 Crores

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ