శ్రీదేవి మరణం విషయంలో వాస్తవాలు తనకు తెలియవని, అందరిలాగానే తాను కూడా టీవీలలో ఈ న్యూస్ తెలుసుకుని, తన భార్య, పిల్లలతో ముంబైకి వెళ్లి ఇంట్లో కాసేపు ఉన్న తర్వాత హోటల్‌లో గది తీసుకున్నామని శ్రీదేవి బాబాయ్ ఎం. వేణుగోపాల్ తెలిపాడు. ఇక బోనీకపూర్ మొదటి భార్య మోనా కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ తనని ఇబ్బందులు పెడుతున్నాడని, తాను మాత్రం అర్జున్‌ని కూడా కుమారుడి చూసినా ఆయన తనపై ద్వేషంతో నానా అగచాట్లు పెడుతున్నట్లు ఆమె తన బంధువులకి తెలిపేదట.
శ్రీదేవి ఎంతో మంచి మనిషి, సున్నిత మనస్కురాలు. చెన్నై వెళ్లినా తమతో టచ్‌లో ఉండేదని, ఏమాత్రం గర్వం లేకుండా కుటుంబసభ్యులందరినీ ఎంతో ఆప్యాయంగా, చూస్తూ ఏ బంధువు వచ్చినా తనకున్నంతలో పది మందికి సాయం చేసిది. మేము సొంతగా ఇల్లు కట్టుకుంటున్నామని తెలిసి ఆమె తమ ఇంటికోసం మార్బుల్స్ పంపించింది. ఆమె సున్నితంగా ఉంటుంది. ఎవరితో గొడవపడే మనస్తత్వం కాదు. ముక్కుకి ఆపరేషన్ జరిగిన తర్వాత మాత్రం తిండి బాగా తగ్గిచ్చింది. ఓ సారి బోనీకపూర్‌కి షుగర్ విపరీతంగా పెరిగి పోతే ఏడ్చేసి డాక్టర్లని పిలిచి ఎంతో ఆందోళన చెందిందని, బోనీ కపూర్ లేకపోతే తాను, తన పిల్లలు ఏమి కావాలని కన్నీరు పెట్టుకుందని ఆమె బాబాయ్ చెబుతున్నాడు.
ఇక శ్రీదేవికి, ఆమె చెల్లెలు శ్రీలతకి అందరు అనుకుంటున్నట్లూ ఆస్తితగాదాలు ఏమీ లేవు. వాళ్లమ్మ రాజ్యలక్ష్మి ఆరోగ్యం బాగా లేకపోతే ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. కానీ ఆసుపత్రిలోని డాక్టర్లు ఒకచోట చేయాల్సిన ఆపరేషన్‌ను, మరో చోట చేయడంతో ఆమె మరణించింది. దాంతో ఆసుపత్రిపై నష్టపరిహారం దావాను శ్రీదేవి, శ్రీలత వేయగా, కొంత డబ్బు రావడంతో ఆ డబ్బు విషయంలో మాత్రమే వారిద్దరు మద్య విభేదాలు వచ్చాయి అంతేగానీ... శ్రీదేవి, శ్రీలతకు ఎలాంటి మనస్పర్థలు లేవని తెలిపాడు. శ్రీదేవికి చికెన్, మటన్ అంటే ఇష్టం. కానీ ముక్కుకి సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె వాటిని తినడం మానివేసింది. బోనీకపూర్ కూడా మాతో బాగుంటాడు. మేము కనిపిస్తే నమస్కారం పెడుతాడు. తాను ఎంత స్టార్‌గా ఎదిగినా కూడా బంధులంటే ప్రాణం ఇచ్చేస్తుంది శ్రీదేవి అని బాబాయ్ ఎం. వేణుగోపాల్ తెలిపాడు.