Advertisementt

రకుల్ తమ్ముడు.. కూడానా..!

Wed 28th Feb 2018 10:59 AM
rakul preet singh,brother,workouts,hero,aman preet singh  రకుల్ తమ్ముడు.. కూడానా..!
Rakul Preet singh Workout with her Brother రకుల్ తమ్ముడు.. కూడానా..!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో గ్లామర్ ఫీల్డ్ లో కొనసాగాలంటే ఎక్కువ కాలం ఫిట్నెస్ చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్స్ కి చాలా అవసరం. ఏమాత్రం గ్యాప్ దొరికిన జిమ్స్ కి వెళ్లి వర్క్ అవుట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ మాత్రం ఫిట్నెస్ లేకపోతే  సినిమాల ఆఫర్స్ వుండవు కాబట్టి.

జిమ్ కి వెళ్లే హీరోయిన్స్ సాధారణంగా తమ పార్ట్నర్స్ గా లవర్స్ ని లేదా బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్తుంటారు. ప్రేమికులుగా ప్రచారం పొందుతున్నవారితోనే కలిసి జిమ్ లో గంటలకొద్దీ సమయం గడుపుతూ ఉంటారు. కానీ రకుల్ మాత్రం ఇందుకు రివర్స్. తమ్ముడు అమన్ తో కలిసి వర్కవుట్స్ చేస్తోంది రకుల్ ప్రీత్.

లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి జిమ్ చేస్తున్న వీడియోను రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తమ్ముడి ట్రైనింగ్ లోనే తన ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేస్తోంది ఈ భామ. అయితే ఇక్కడ పైకి కనపడని ఓ సీక్రెట్ ఉంది లెండి. రకుల్ కు హైదరాబాద్ లో ఫిట్నెస్ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన ఫ్రాంచైజీలున్నాయి. వీటిని చూసుకునేది ఆమె తమ్ముడే. మరోవైపు ఆమె తమ్ముడిని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తోంది రకుల్. అటు తన తమ్ముడికి...ఇటు వ్యాపారానికి రెండింటికి ప్రచారం లభించేలా ఇలాంటి పోస్టులు పెడుతోందట రకుల్ ప్రీత్ సింగ్.

Rakul Preet singh Workout with her Brother:

Rakul Preet to Launch Her Brother as a Hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ