కొత్త దర్శకులు డిఫరెంట్ టైప్ సినిమాలు తీసి అందరిని ఆకట్టుకుంటున్నారు. మొన్న వచ్చిన 'ఘాజీ' నిన్న వచ్చిన 'అ!' రిజల్ట్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. సినిమా కలెక్షన్స్ పక్కన పెడితే అసలు సినిమా ఎలా వచ్చింది అనే విషయం గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారు.
కాన్సెప్ట్ బావున్నా సినిమా ప్రజెంటేషన్ కన్ఫ్యూజన్ గా ఉండడంతో చాలావరకు మాస్ ఆడియెన్స్ కి సినిమా ఎక్కలేదు కానీ ఓవర్సీస్ లో 'అ!' మంచి విజయం సాధించింది. నాని ప్రొడక్షన్ కావడంతో ముందు నుండే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. నాని ప్రొమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేసాడు. రాజమౌళి.. అనుష్కలని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెగ వాడేసుకున్నాడు. అయితే సినిమా విడుదల అయ్యాక దాని గురించి వీరు అసలు మాట్లాడలేదు.
తెలిసిన స్టోరీలానే వున్నా లెస్బియన్ - మెంటల్ డిజాస్టర్ వంటి అంశాలను కొత్తగా టచ్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నాని నిర్మాణాన్ని కూడా శభాష్ అనాల్సిందే. అయితే కనీసం దర్శకధీరుడు వాటిపై కూడా కామెంట్ చేయలేదు. మహేష్ బాబు..అల్లు అర్జున్..ప్రభాస్..రామ్ చరణ్..ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ ఎందుకు ఇటువంటి సినిమాను ఎంకరేజ్ చెయ్యట్లేదు. సపోర్ట్ చేస్తేనే కదా ఇటువంటి కొత్త సినిమాలు ఇంకా పుట్టుకొస్తాయి. ఎంకరేజ్ చేయాలనీ రూల్ ఏమి లేదు కానీ ఒక చిన్న ప్రోత్సాహం ఇస్తే ఇటువంటి డైరెక్టర్స్ పుట్టుకొస్తారు. ఇండస్ట్రీ బావుంటేనే అందరు బావుంటారు. ఆ విధంగా కొంచెం బూస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత సినీ ప్రముఖుల చేతుల్లోనే ఉంది మరి.