అతిలోక సుందరి శ్రీదేవి హఠాత్తుగా దుబాయ్‌లోని జుమీరా ఎమిరేట్స్ హోటల్‌లో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. నిజానికి ఆమెది సహజసిద్దమైన ముందుగా అనుకున్నట్లు గుండె పోటు మరణం అయితే ఇంతలా చర్చసాగేది కాదు. పుట్టిన వాడు ఏదో ఒకనాడు గిట్టకతప్పదని, కాకపోతే చిన్న వయసులోనే ఆమె మృత్యుఒడికి చేరడం బాధాకరణమని పలువురు వాపోతున్నారు. ఆమె మరణం మిస్టరీగా మారిన నేపధ్యంలో ఆమె మరణం కూడా వివాదాల మయం అయి ఆమెకి చెడ్డపేరు తేవడం నిజంగా ఎంతో చింతించాల్సిన విషయం.
ఇక దుబాయ్‌లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. అదే ఇండియాలో మరణించి ఉంటే ఏదో ఒకటి చేసేసి ఇప్పటికే దహన క్రియలు కూడా జరిపేవారు. మన రాజకీయనాయకులు, డాక్లర్లు, పోలీస్‌లు ప్రముఖుల మరణాల విషయంలో ఇప్పటికీ ఏ ఒక్క సినీ నటుల మృతికి కారణాన్ని ఇప్పటివరకు చెప్పలేకపోయారు. దివ్యభారతి, జియాశాన్, ప్రత్యూష, ఆర్తిఅగర్వాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. ఇక శ్రీదేవి మరణంపై ఓ క్లారిటీ వచ్చే వరకు ఆమె భౌతికకాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మొదటగా ఆమె మరణం గురించి అధికారికంగా మాట్లాడింది కేవలం బోనీకపూర్ సోదరుడు సంజయ్‌కపూర్ మాత్రమే. ఆయన కూడా శ్రీదేవికి గతంలో ఎప్పుడు గుండెపోటు రాలేదని, మొదటిసారి అది తీవ్రంగా రావడంతో మరణించిందని మీడియాతో చెప్పాడు.
కానీ ఈయన తప్ప బోనీకపూర్ నుంచి ఆమె కుటుంబసభ్యులు, బోనీకపూర్ బంధువులే కాదు ఎవరూ నోరు విప్పడం లేదు. ఇక మొదట డెత్ సర్టిఫికేట్‌లో గుండెపోటు కాదని, ప్రమాదవశాత్తూ బాత్రం టబ్‌లో పడి మరణించిందని పేర్కొన్నారు. కానీ దుబాయ్ పబ్లిక్‌ప్రాసిక్యూటర్ రంగ ప్రవేశంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆమె నీటిలో మునిగి మరణించవచ్చు గానీ ప్రమాదవశాత్తూనే ఆమె బాత్‌టబ్‌లో పడిందని ఎలా చెప్పగలరు? అని ఆయన వాదిస్తున్నాడు. బాత్‌టబ్‌లో పడి మరణించడానికి ప్రమాదవశాత్తూ పడి మరణించడం సరిగానే ఉంది. కానీ బత్‌లో ఎవరైనా ముంచి చంపివేసే అవకాశం ఉంది... మరి రెండో పాయింట్‌ని శవపరీక్షల చేసిన డాక్టర్లు ఎలా నిర్దాకరించగలరు. వారు కేవలం నీటిలో మునిగా చనిపోయిందని మాత్రమే చెప్పగలరు. ఇక ఈమె మృతదేహానికి నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఎంబామింగ్ అంటే శవం చెడిపోకుండా రసాయనాలతో ఆమె దేహాన్ని చెడిపోకుండా చేసే ప్రక్రియలో కూడా తీవ్ర జాప్యం జరగుతోంది.
ఇక దుబాయ్ అధికార వర్గాలు శ్రీదేవికి సంబంధించిన మరిన్ని ఆధారాలు కావాలని మన ఎంబసీని కోరారు. ఇవ్వన్నీ చూస్తుంటే ఆమె మరణం కన్నా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఆమె మరణంపై వస్తున్న స్టోరీలు మాత్రం సాధారణ శ్రీదేవి అభిమానిని తట్టుకోలేని విధంగా చేస్తున్నాయి. అయినా ఆమె దుబాయ్‌లో మరణించింది కాబట్టి ఇండియాలోలాగా పలుకుబడి, డబ్బుతో కేసు పక్క దారి పట్టే అవకాశం లేదని, పూర్తి వివరాలు బయటికి వస్తాయని కొందరు ఆశతో ఉన్నారు. ఇక ఈమె మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో తెచ్చేందుకు రిలయన్స్‌కి చెందిన ముఖేష్ అంబాని విమానం దుబాయ్‌లోనే రెండు రోజులుగా ఉంది.