Advertisementt

'భరత్' రిలీజ్ డేట్ మరోసారి మారనుందా?

Tue 27th Feb 2018 03:07 PM
mahesh babu,bharath ane nenu,release date,koratala siva  'భరత్' రిలీజ్ డేట్ మరోసారి మారనుందా?
Again Rumours on Bharath Ane Nenu Release Date 'భరత్' రిలీజ్ డేట్ మరోసారి మారనుందా?
Advertisement
Ads by CJ

'నా పేరు సూర్య', 'భరత్ అనే నేను' రిలీజ్ డేట్స్ పట్ల ఏర్పడిన వివాదం ఓ కొలిక్కి వచ్చి మహేష్ ఏప్రిల్ 20న.. అల్లు అర్జున్ మే 4న వస్తున్నారు. డేట్ అయితే అనౌన్స్ చేసారు కానీ 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించి చాలా వర్క్ పెండింగ్ లోనే ఉంది.

'స్పైడర్' డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి మహేష్ దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మొదట్లో స్క్రిప్ట్ పరంగా మార్పుచేర్పులు జరిగినట్టు వినిపించింది. అందుకే కొంత భాగం షూట్ చేసాక అది పక్కన పడేసి మళ్లీ తీసారని టాక్ వినిపించింది. ఈ డిలే వల్ల సినిమా టాకీ ఇంకా పూర్తవలేదు.

మార్చిలో విదేశాల్లో మేజర్ షెడ్యూల్‌ కోసం వెళ్లనున్నారు చిత్ర బృందం. తర్వాత హైదరాబాద్ లో సాంగ్స్ షూట్ చేయనున్నారు. మరి ఇదంతా ఎప్పుడు జరగాలి? రిలీజ్ డేట్ దగ్గర పడటంతో అందరు కొన్ని రోజుల పాటు డబుల్‌ కాల్షీట్స్‌ వర్క్‌ చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు ఈ చిత్రం జూన్‌కి వాయిదా పడవచ్చుననే గాసిప్‌లు సర్కులేట్‌ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సివుంది.

Again Rumours on Bharath Ane Nenu Release Date:

Rumours on Mahesh Babu Bharath Ane Nenu Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ