శ్రీదేవి మరణానికి ముందు భర్త బోనీ కపూర్ ఆమెను సర్‌ప్రైజ్ చేద్దాం అనుకున్నాడట. కానీ శ్రీదేవి అందరిని సర్‌ప్రైజ్ చేసి తిరిగి రాణి లోకాలకి వెళ్లిపోయింది. మేనల్లుడి పెళ్లి కోసం దుబాయ్ కు చేరుకున్న శ్రీదేవి ఫ్యామిలీ అక్కడ జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేశారు.
ఆరోజు రాత్రికి శ్రీదేవికి అద్భుతమైన డిన్నర్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామని భర్త బోనీ భావించాడట. ఈ విషయం గురించి శ్రీదేవికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు బోనీ కపూర్. డిన్నర్ కు ముందు నిద్రపోతున్న శ్రీదేవి లేపి 15 నిముషాలు పాటు మాట్లాడుకున్నారట.
ఆ తర్వాత రెడీ అయేందుకు శ్రీదేవి బాత్రూమ్ కి వెళ్ళిందని, వెళ్లి చాలా సేపు అయినా బయటకి రాకపోవడంతో వెంటనే బోనీ కపూర్ వెళ్లి డోర్ కొట్టారట. కానీ లోపల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో బలవంతంగా డోర్ తెరిచి, లోపల శ్రీదేవి బాత్‌టబ్‌లో అచేతనంగా పడి ఉండడంతో లేపడానికి ప్రయత్నించారట. అది సాధ్యం కాక స్నేహితులకి.. పోలీస్ వారికి..డాక్టర్స్ కి ఇన్ఫార్మ్ చేసాడట. డాక్టర్స్ వచ్చేలోపే శ్రీదేవి తుదిశ్వాస విడిచారని తెలుస్తుంది.