Advertisementt

సాయిపల్లవినే ఎందుకు హైలైట్ చేస్తున్నారు..?

Mon 26th Feb 2018 11:46 PM
kanam,naga shourya,sai pallavi,dominates  సాయిపల్లవినే ఎందుకు హైలైట్ చేస్తున్నారు..?
Sai Pallavi Dominates Hero Naga Shourya సాయిపల్లవినే ఎందుకు హైలైట్ చేస్తున్నారు..?
Advertisement
Ads by CJ

సాయి పల్లవి క్రేజ్ మాములుగా లేదు. ఆ అమ్మాయి హీరోయిన్ అంటే ఆ సినిమాకి వచ్చే హైపే వేరు. సాయి పల్లవి ఏ హీరోతో సినిమా చేస్తుందో కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కొందరు లేరు అంటే నమ్మాలి. మొన్నటికి మొన్న ఫిదా తో వరుణ్ తేజ్ ని డామినేట్ చేసిన సాయి పల్లవి, నిన్న ఎంసీఏ లో నానితో పోటీగా నటించి మార్కులు కొట్టేసింది. ఇక ఇప్పుడు సాయి పల్లవి మరో సినిమాలో తన క్రేజ్ ని చూపించబోతుంది. కేవలం సాయి పల్లవి గురించే ఈ సినిమా తీశామా అన్నట్లుగా ఆ సినిమా దర్శక నిర్మాతలు కూడా అందులో హీరోని ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఆ సినిమా మరేదో కాదు. నాగ సౌర్య, సాయి పల్లవి జంటగా విజయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'కణం' సినిమా.

ఈ సినిమా మొదలైనప్పటినుండే నాగ సౌర్య, సాయి పల్లవి గురించిన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాడు. అసలు ఈ సినిమాలో హీరో నాగ సౌర్య కి సాయి పల్లవికి పడడం లేదనే టాక్ ఉంది. నాగ సౌర్య కూడా సాయి పల్లవి ప్రతిదానిలో డామినేషన్ చూపిస్తుందంటూ పబ్లిక్ గానే అసహనం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఒక హీరోని... హీరోయిన్ అలా కించపరుస్తుంటే ఎన్నాళ్ళు తట్టుకుంటారు. అందుకే నాగ సౌర్య, సాయి పల్లవిపై వీలున్నప్పుడల్లా ఫైర్ అవుతూనే ఉన్నాడు. అందుకేనేమో ఇప్పుడు నాగ సౌర్యాని ఆ సినిమా ప్రమోషన్స్ నుండి పూర్తిగా తప్పించేసి సాయి పల్లవిని హైలెట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

సినిమా పోస్టర్స్ దగ్గరనుండి.... ఆడియో లాంచ్ వరకు సాయి పల్లవితోనే ప్రమోట్ చేయిస్తూ నాగ సౌర్యాని తోక్కేస్తున్నారు. మరి నాగ సౌర్య తన మీద చేస్తున్న ఆరోపణల విషయంలో గమ్మున ఉన్న సాయి పల్లవి ఇపుడు ఆ సినిమా ప్రమోషన్స్ కి నాగ సౌర్య ని పిలవనివ్వకుండా దర్శక నిర్మాతలను ఆడిస్తుందనే టాక్ వినబడుతుంది. ఇదంతా సాయి పల్లవి కావాలనే చేస్తోంది అంటున్నారు. లేదంటే ఎంసీఏ సినిమా టైం లోనే నాని కి సాయి పల్లవికి మధ్య విభేదాలు వచ్చాయని.... అన్నారు. కానీ సినిమా ప్రమోషన్స్ లో దిల్ రాజు గారి రాజీతో నాని, సాయి పల్లవిలు ఎంతలా పాల్గొన్నారో తెలిసిందే. సాయి పల్లవి, నాని కెమిస్ట్రీ చూసిన వారు వీరి మధ్యలో గొడవలేమిటి అని అనుకునేలా వారు ప్రవర్తించారు. కానీ ఇప్పుడు నాగ సౌర్య కి సాయి పల్లవి కి మధ్య తలెత్తిన విభేదాలు దర్శక నిర్మాతలు పరిష్కరించక పోగా... నాగ సౌర్యాని కించపరుస్తూ సాయి పల్లవిని హైలెట్ చేస్తున్నారు. చూద్దాం కణం విడుదలయ్యాక నాగ సౌర్య రోల్ సినిమాలో ఎలా వుండబోతుందో..

Sai Pallavi Dominates Hero Naga Shourya:

Kanam movie producers insults hero naga Shourya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ