తాను తీసిన 'గాడ్స్ సెక్స్ అండ్ ట్రూత్' విషయంలో వివాద దర్శకుడు రాంగోపాల్‌వర్మపై ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఈ ఫిల్మ్‌ని తాను స్వయంగా తీయలేదని, స్కైప్‌ద్వారా తీశానని అంటున్నాడు. మరోవైపు ప్రముఖ జాతీయ దినపత్రిక మాత్రం వర్మ ఈ ఫిల్మ్‌ని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లోనే తీశాడని, మియా కూడా హైదరాబాద్‌కి వచ్చి షూటింగ్‌లో పాల్గొన్న సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని అంటోంది. అదే నిజమైతే ఇండియాలో పోర్న్ సినిమా తీయడం నేరం కాబట్టి, వర్మకి, ఆ హోటల్ యాజమాన్యంకి కూడా తిప్పలు తప్పేలా లేవు.
ఇక తాజాగా వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మీడియా కావాలనే ఓ సమస్యను పెద్దది చేసి, ఏదైనా అంశాన్ని తప్పా? రైటా? అనేది తానే నిర్ణయించుకుని దానికి వ్యతిరేకంగా ఓ చర్చ పెట్టి తన టీఆర్పీలు పెంచుకుంటోందని, టివి9 పేరును ఆయన డైరెక్ట్‌గా ప్రస్తావించారు. నిజమే.. టివి9 ఇలా టీఆర్పీల కోసం నానా రచ్చలు చేస్తున్న విషయం నిజమే. మరి వారిని పెంచి పోషిస్తోంది తమ సొంత పబ్లిసిటీ కోసం వర్మ వంటి వ్యక్తులే కారణమని చెప్పాడు. ఇక వర్మ ప్రముఖ సామాజిక నేత దేవి, ఐద్వా నాయకురాలు మణిలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇది పోలీస్‌ల విచారణ దాకా వెళ్లింది. ఖచ్చితంగా ఇందులో వర్మకి శిక్ష పడటం ఖాయం అంటున్నారు.
అలాంటి సమయంలో వర్మ తాజాగా మాట్లాడుతూ.. స్త్రీవాదం, మహిళా భావజాలం విషయంలో తాను ఓపెన్ డిబేట్ కి సిద్ధమై, మార్చి 8వ తేదీన తాను ఈ అంశాలపై వైజాగ్‌లో భారీ బహిరంగ సభను పెడుతానని, అదేరోజున తన భావాలతో వ్యతిరేకించేవారు. తనపై దుష్ప్రచారం చేసేవారు...తన వ్యతిరేకులు కూడా మీటింగ్ పెట్టుకోవాలి. ఏ సభకు ఎక్కుకమంది జనాలు వస్తారో చూద్దాం... ఎవరిమీటింగ్‌కి ఎక్కువమంది జనాలు వస్తే అప్పుడు పూర్తి నిజం ఒక దెబ్బకు తేలిపోతుంది. తన సమావేశానికి యువత, కాలేజీ స్టూడెంట్స్, మహిళలు, తన భావాలతో ఏకీభవించేవారు పెద్ద ఎత్తున రావాలని ఆయన పిలుపునిస్తూ మరో వివాదానికి శ్రీకారం చుట్టాడు...!