త్రిష ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం అయింది. ఆమె నాటి సీనియర్‌స్టార్స్ నుంచి యంగ్‌స్టార్స్ వరకు అందరితో నటించింది. కేవలం రజనీకాంత్‌ని మాత్రమే మిస్‌చేసుకుంది ఈ చెన్నై చిన్నది. తన వయసు 30 దాటినా కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆమద్య నిశ్చితార్దం కూడా చేసుకుని, ఫేడవుట్ అయ్యాను కాబట్టి పెళ్లి చేసుకొని స్థిరపడాలని భావించింది. కానీ పెళ్లి రద్దు కావడం త్రిష కెరీర్ మరలా పుంజుకోవడం విచిత్రంగా జరిగాయి. అయితే ఇప్పుడు ఆమె అన్ని రకాల పాత్రలు చేస్తోంది. ముఖ్యంగా తమిళ, తెలుగు రెండు భాషల్లో వర్కౌట్ అయ్యేలా లేడీఓరియంటెడ్ చిత్రాలకు శ్రీకారం చుట్టింది.
'నాయకి' చిత్రం ఆడకపోయినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక ఈమె ప్రస్తుతం అరవింద్‌స్వామి హీరోగా నటిస్తున్న 'చతురంగ వెట్టై2', విజయ్‌సేతుపతితో 96, 1818 చిత్రాలతో పాటు 'మోహిని, గర్జన' అనే రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. ఇక ఈమె సామి2 నుంచి తప్పుకున్న విషయంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో అమ్మడు తన శిక్షకుడి పర్యవేక్షణలో బాక్సింగ్ చేస్తూ కిక్ బాక్సర్‌గా మారిన వీడియా వైరల్ అవుతోంది.
ఇందులో ఆమె ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా లేదు. పోటీలో విజయం సాధించాలనే తపన ఉన్న మనిషిలా రెచ్చిపోయి కిక్‌బాక్సింగ్ చేస్తోంది. ఆమె తాజా చిత్రంలో ఆమె కిక్‌బాక్సర్‌గా నటించనుండటంతోనే ఇందులో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదైనా కష్టపడాలని, ట్రైనింగ్ అయినా కూడా ప్రోఫెషనల్‌గా వ్యవహరించాలని, చేసే పనిపై దృష్టి పెట్టి పాత్ర కోసం అన్ని కసరత్తులు చేస్తూ పాత్రలో పరకాయప్రవేశం చేయడం ఎలా? ఓ నటిగా కమిట్‌మెంట్ చూపడం ఎలా? అనేవి మాత్రం ఈ వీడియోలో త్రిషని చూస్తే అర్ధమవుతున్నాయి.