ప్రస్తుతం భీకరఫామ్‌లో ఉన్న హీరో ఎవరంటే ఎవరైనా ఠక్కున నాని పేరే చెబుతారు. అలా నేచురల్‌స్టార్ వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్నాడు. కొన్నిరొటీన్ చిత్రాలను కూడా తన క్రేజ్‌తో హిట్ స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన 'కృష్ణార్జున యుద్ధం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. వరుసగా రెండు చిత్రాలు 'వెంకటాద్రిఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌రాజా'లతో హిట్స్‌కొట్టి సెకండ్ సెంటిమెంట్‌ను పక్కనపెట్టిన మేర్లపాకగాంధీ 'కృష్ణార్జున యుద్ధం'తో హాట్రిక్ కొట్టి, నానికి పెద్దహిట్ ఇచ్చి స్టార్స్ దృష్టిలో పడాలని చూస్తున్నాడు. ఇక ఇందులో అనుపమపరమేశ్వరన్, రుక్సార్‌మీర్‌లు హీరోయిన్లు. ఈ చిత్రం థియేటికల్ రైట్స్‌ని మొత్తంగా దిల్‌రాజు తీసుకున్నాడని సమాచారం.
'తొలిప్రేమ'తో బాగా వెనకేసుకున్న దిల్‌రాజ్ కన్ను ఈ చిత్రంపై పడిందంటే ఇక కావాల్సింది ఏముంది? ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నట్లు కనఫర్మ్ చేశాడు. కానీ మార్చి 30న రామ్‌చరణ్,సుకుమార్‌ల 'రంగస్థలం'తో వస్తున్నారు. అదే రోజున 'మహానటి' కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏప్రిల్ 20న మహేష్ 'భరత్ అనే నేను' చిత్రం విడుదల కానుంది. అందువల్ల ఈ స్టార్ హీరోలకు సైడ్ వచ్చి బన్నీ 'నాపేరు సూర్య-నా ఇల్లు ఇండియా' కూడా విడుదలైన తర్వాత మే 18న వస్తే బాగుంటుందని దిల్‌రాజు భావిస్తున్నాడు. దీంతో ఈ పెద్ద చిత్రాలన్నీ విడుదలై హిట్ కొట్టినా కూడా మే18కి అంతా సర్దుకుంటుంది.
కాబట్టి మే18 అని దిల్‌రాజు అంటుంటే తగ్గాల్సిన పనిలేదని, ముందుగా అనుకున్న ఏప్రిల్ 12నే విడుదల చేయాలని నాని పట్టుదలతో ఉన్నాడట. ఇక మే 18న అర్జున్‌రెడ్డిగా గుర్తుండిపోయిన విజయ్‌దేవరకొండ 'ట్యాక్సీవాలా' గోపీచంద్ 25వ చిత్రం 'పంతం' విడుదలకు సిద్దమవుతున్నాయి. మరి 'కృష్ణార్జున యుద్ధం'తో కృష్ణా గెలుస్తాడా? లేదా అర్జునుడు గెలుస్తాడా? దిల్‌రాజు పంతం నెరవేరుతుందా? నాని పంతం నెగ్గనుందా? అనేది వేచిచూడాల్సివుంది...!