కేవలం 12 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రామిసిండ్ డైరెక్టర్లు తమ సినిమా టైటిల్స్‌ని ప్రకటించారు. 'గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం' వంటి చిత్రాలతో అందరినీ ఆకర్షించే అతి తక్కువ బడ్జెట్‌తో 'గౌతమీ పుత్రశాతకర్ణి' వంటి బాలయ్య వందో ప్రతిష్టాత్మక, చారిత్రక చిత్రం తీసి కమర్షియల్‌గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు క్రిష్. ఈయన ప్రతిభను మెచ్చి స్వయంగా ఈయనకే గతంలో 'గబ్బర్' తీసిన అనుభవంతో ఝాన్సీలక్ష్మీభాయ్ జీవిత చరిత్ర 'మణికర్ణిక' చాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆయన 'అహం బ్రహ్మస్మి' అనే టైటిల్‌తో చిత్రం చేయనున్నాడు. ఈయన 'మణికర్ణిక' ముందు అల్లు అర్జున్‌కి ఈ స్టోరీని వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం.
ఆయన కాదన్నా కూడా తన సొంతంగా, ఫస్ట్‌ఫ్రేమ్ పతాకంపై రాజీవ్‌రెడ్డితో కలిసి ఆయన వెంకటేష్‌తోనైనా సరే చేయడానికి రెడీ అవుతున్నాడు. మరోపక్క 'గబ్బర్‌సింగ్'తో కమర్షియల్ డైరెక్టర్‌గా తానేమిటో నిరూపించుకుని, 'డిజె' వంటి రొటీన్ చిత్రంతో కూడా కమర్షియల్ సక్సెస్‌ని సాధించానని హరీష్‌శంకర్ చెబుతున్నాడు. అయితే 'డిజె' హిట్టా? ఫ్లాపా? అనే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన కాన్సెస్ట్ ఓరియంటెడ్ చిత్రాన్ని పూర్తిగా యూఎస్‌లో తీయడానికి రెడీ అవుతున్నాడు. దానికి 'దాగుడుమూతలు' అనే టైటిల్ ఖరారైంది. ఇందులో నితిన్, శర్వానంద్‌లు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకే వెళ్లలేదు.
ఆయన 'డిజె' లోని మాస్ సాంగ్ 'సిటీ మార్' అనే టైటిల్‌తో సినిమా చేయనున్నానని చెబుతున్నాడు. నిజానికి 'డిజె' సక్సెస్ మీట్ సందర్భంగానే హరీష్‌శంకర్ ఈ స్టోరీని కూడా అల్లు అర్జున్‌కి చెప్పాడట. ఇక ఆయన ఒప్పుకోకపోయినా వరుణ్‌తేజ్‌తో 'సిటీ మార్' అనిపించాలని హరీష్ ఆలోచన. మరి క్రిష్ 'మణికర్ణిక', హరీష్‌శంకర్‌ల 'దాగుడుమూతలు' ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో అనే దానిని బట్టి ఈ రెండు చిత్రాలలో నటించే హీరోలు ఎవరు? అనేది ఆధారపడి ఉంది.