'బాహుబలి' అద్భుత చిత్రమే అయినా ఆ చిత్రాన్ని డబ్బింగ్ అనే ఫీల్ రాకుండా బాలీవుడ్‌లో హిందీలో అనువాదం చేసి స్ట్రెయిట్ చిత్రంగా ప్రమోట్ చేయడంలో కరణ్‌జోహార్ కీలకమైన పాత్ర పోషించాడు. చిత్రానికి కావాల్సినన్ని ధియేటర్లు లభ్యమయ్యేలా చూడటం నుంచి ముందు నుంచి ప్రమోషన్స్ విషయంలో ఇదో స్ట్రెయిట్ చిత్రం అనిపించేలా చేసి, ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఏ అనువాద చిత్రం వసూలు చేయని కలెక్షన్లు సాదించేలా చేయడంలో కరణ్‌ది కీలక పాత్ర. ఇక ఆయన ప్రభాస్‌తో బాలీవుడ్‌లోనే త్వరలో ఓ స్ట్రెయిట్ చిత్రం కూడా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం తనదైన యువి క్రియేషన్స్ బేనర్‌లోనే కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న సుజీత్‌తో 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. హీరోయిన్ నుంచి సంగీత దర్శకులు, విలన్లు ఇలా ఎక్కువగా బాలీవుడ్ వారినే పెట్టుకుని, తెలుగుతోపాటు తమిళ్, హిందీలలో ఒకేసారి తీయాలని నిర్ణయించుకున్నాడు. 'బాహుబలి'కి ముందు కేవలం 50, 60 కోట్ల ప్రాజెక్ట్ కాస్తా 'బాహుబలి' విడుదలైన తర్వాత అది 150కోట్లకు పెరిగింది. ఇక ప్రస్తుతం కరణ్‌జోహర్ ఈ చిత్రం బాలీవుడ్ వెర్షన్ సంగతి తనకి వదిలేయాలని, తాను మార్కెట్ చేసి చూపిస్తానని హామీ లభించడంతో 'సాహో' యూనిట్ ఎంతో ఆనందంగా ఉంది. ఇక బాలీవుడ్ మార్కెట్ కూడా కరణ్‌జోహార్ చేతుల్లో పడటంతో ఈ చిత్రం బడ్జెట్ మరో 60కోట్లు పెరిగి 210 కోట్లకు ఫిక్స్ అయిందట.
ఇక ఈ చిత్రం కోసం యూనిట్ త్వరలో అబుదాబికి వెళ్లనుంది. అబుదాబి, దుబాయ్, రుమేనియా దేశాలలో చిత్రీకరణ జరగనుంది. అది కూడా చిన్న షెడ్యూల్ కాదు. ఏకంగా రెండు నెలల షెడ్యూల్. ఈ షెడ్యూల్‌కే సగం బడ్జెట్‌ని కేటాయించారట. భారీ యూనిట్‌ని కూడా తమ వెంట తీసుకెళ్తున్నారు. మరి 'బాహుబలి'కి అయితే అపజయం ఎరుగని రాజమౌళి బ్రాండ్ ఉంది. మరి 'సాహో' దర్శకుడు సుజీత్‌ది పెద్దగా అనుభవం లేని పరిస్థితి. మరి సుజీత్‌ని నమ్మి ఇన్నికోట్లు ఖర్చుపెడుతున్నారంటే ఆయనపై నిర్మాతలకు ఉన్న నమ్మకం అర్ధమవుతోంది.