Advertisementt

పవన్ పై మళ్లీ కత్తి దూశాడు..!

Sat 24th Feb 2018 11:27 AM
pawan kalyan,kathi mahesh,bjp attack,sivaji  పవన్ పై మళ్లీ కత్తి దూశాడు..!
Kathi Mahesh Straight Question to Pawan Kalyan పవన్ పై మళ్లీ కత్తి దూశాడు..!
Advertisement
Ads by CJ

సాధారణంగా మీడియాపై దాడి జరిగితే దానిని మీడియా స్వేచ్చకు ఆటంకంగానే పరిగణించాలి. ఎందుకంటే ఫోర్ట్‌ ఎస్టేట్‌గా చెప్పుకునే మీడియాలో కూడా పలు లుకలుకలు ఉన్నా కూడా మీడియాకి స్వేచ్చ లేకపోతే అది ప్రజాస్వామ్యానికి తీవ్ర చేటు చేస్తుంది. ఇక కత్తి మహేష్‌ విషయంలో పవన్‌ అభిమానులు ఆయనపై మండిపడటం, పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. చివరకు పవనే కోనవెంకట్‌ ద్వారా ఓ అడుగు ముందుకేసి జనసేన కార్యాలయం నుంచి ప్రెస్‌నోట్‌ని విడుదల చేయించి ఈ వివాదానికి ముగింపు పలికాడు. కానీ కత్తి మహేష్‌ మాత్రం ఆ తర్వాత కూడా తనకిష్టమొచ్చినట్లు పవన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. పోర్న్‌ కళ్యాణ్‌ అనే శబ్దం, సౌండింగ్‌ భలే ఉన్నాయని రెచ్చగొట్టాడు. అదే ఆయన విషయంలో ఇదే విధంగా ఎవరైనా మాట్లాడితే ఆయన మీడియా స్వేచ్చ, తన స్వంత భావాలు, దళిత కార్డు వంటివి బయటికి తీస్తాడు.

ఇక ఉదాహరణకు మనం మోడిని విమర్శిస్తే మన మీద బిజెపి వారు దాడి చేస్తే మోడీనే ఖండించాలని భావించడం అవివేకం. స్థాయిని బట్టి ఖండనలు ఉంటాయి. ఇవి వ్యక్తి స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి. అదే ఏ చంద్రబాబు, కేజ్రీవాల్‌, రాహుల్‌గాంధీ వంటి వారిపై దాడి జరిగితే మోదీ స్పందిస్తాడే గానీ గల్లీ లీడర్లకు కూడా మోదీనే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టడం తప్పు. ఇక తాజాగా మహా న్యూస్‌ చానెల్‌ గత కొన్నిరోజులుగా 'ఢిల్లీతో ఢీ.. ఏపీ రెడీ' అనే కార్యక్రమం ప్రసారం చేస్తూ ప్రజల మనోభావాలు తెలుసుకునే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సంస్థ సీఈవో తాజాగా విజయనగరం వెళ్లాడు. అక్కడ ఆయన కారుపై, లైవ్‌ టెలికాస్ట్‌ల ప్రసారానికి ఉపయోగించే వాహనంపై కూడా దాడి జరిగింది. ఇక మొన్న హీరో శివాజీని బిజెపి మూకలు అటాక్‌ చేశాయి. ఈ రెండింటిని జనసేన ఖండించింది. 

దాంతో పవన్‌ ఓ అమాయకమైన స్టూడెంట్‌, ఉండవల్లి ఓ రిటైర్డ్‌ టీచర్‌ అంటూ వ్యంగ్యాస్రాలు విసిరిన కత్తి పవన్‌ని ఉద్దేశించి, ఈ రెండు దాడులను ఖండించావు. మరి నా విషయంలో ఎందుకు స్పందిచలేదు. నోరు పడిపోతుందా? మనసు రాదా? నీలో స్పందన ఉండదా? అని ట్వీట్‌ చేశాడు. ఇక్కడ విషయం ఏమిటంటే కత్తిమహేష్‌ తనస్థాయిని ఇతర పెద్దల స్థాయిలో ఊహించుకుని పదే పదే పవనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తుంటే నవ్వురాక మానదు. 

Kathi Mahesh Straight Question to Pawan Kalyan:

Pawan Kalyan Fires On BJP For Attack On Hero Sivaji.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ