సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ హడావిడి కొంత కాలమే నడుస్తుంది. హీరోస్ లాగ ఏళ్ళ తరబడి పాతుకుపోరు. ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ వస్తూనే వుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే నడుస్తుంది. కొత్త హీరోయిన్స్ వచ్చి పాత హీరోయిన్స్ ని 'గో సైడ్ అండ్ ప్లే' అంటున్నారు.
ఒక్కే టైంలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు కాజల్ అండ్ సమంత. అప్పటికే స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న త్రిష - శ్రియ లకు టెండర్ పెట్టారు. నెమ్మదిగా వారి ఆఫర్స్ వీరు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన శ్రుతి హాసన్, తమన్నా కొంతకాలం అందరి హీరోస్ తో నటించి మెరుపులు మెరిపించారు. కానీ ఎక్కువ కాలం వీళ్ల హవా కొనసాగలేదు. రకుల్ వచ్చి అప్పటికే స్టార్ హీరోయిన్స్ గా ఉన్న కాజల్.. తమన్నా, శ్రుతిలకు చుక్కలు చూపించింది. కొన్నాళ్ల పాటు టాప్ హీరోయిన్ గా చలామణి అయింది.
ఇప్పుడు ఆమె కాలం కూడా ముగిసిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అను ఇమ్యాన్యుయేల్, రాశి ఖన్నా, సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వీరికే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎవరి రేంజ్ లో వారు రెచ్చిపోతున్నారు. ఇక సమంత, అనుష్క సీనియర్ హీరోయిన్స్ అయ్యిపోయారు. అనుష్క పెద్ద హీరోస్ తో.. లేదా ఫీమేల్ లీడ్ తప్ప వేరే సినిమాలు చెయ్యట్లేదు. అలానే సమంత కూడా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ గడిపేస్తుంది. అక్కినేని వారి ఇంటి కోడలు కదా..అవకాశాలు వస్తూనే ఉంటాయి.