రజినీకాంత్ - శంకర్ కాంబోలో వస్తున్న '2.0' సినిమా ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా... గ్రాఫిక్స్ పనుల వలన సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన '2.0' సినిమా విడుదల ఆలస్యానికి కారణం మెయిన్ గా గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడమే. అందులోను శంకర్ గ్రాఫిక్స్ వర్క్ అప్పజెప్పిన సంస్థ సగం వర్క్ కంప్లీట్ చేసాక ఉన్నట్టుండి దివాళా తీయడంతో... మిగతా వర్క్ ను ఇతర సంస్థలకి అప్పగించారు. మరి కేవలం మిగతా వర్క్ మాత్రమే కాకుండా మొత్తం మొదటినుండి గ్రాఫిక్ వర్క్ ని శంకర్ మళ్లీ చేయిస్తున్నాడట.
అసలే అన్ని విషయాల్లోనూ పర్ఫెక్షన్ కోసం శంకర్ కాంప్రమైజ్ కాడు. అందుకే '2.0' గ్రాఫిక్ వర్క్ ని మరో సంస్థ ద్వారా మళ్లీ మొదలు పెట్టించడం వల్లనే సినిమా విడుదల మళ్లీ పోస్ట్ పోన్ అయ్యి విడుదల తేదీని ప్రకటించలేని పరిస్థితుల్లో ఉంది. మరి ఇలా సినిమా విడుదల ప్రతిసారి వాయిదా పడడంతో ఈ సినిమాకి భారీగా బడ్జెట్ పెట్టిన లైకా ప్రొడక్షన్స్ వారు తీవ్రమైన అసహనానికి లోనవ్వడమే కాదు.. ఈ విధమైన ఆలస్యం కారణంగా తాము భారీగా నష్టాల పాలవుతున్నామనీ ... ఇప్పటికైనా కరెక్ట్ గా రిలీజ్ డేట్ చెప్పమని దర్శకుడు శంకర్ ను నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నారట.
దాంతో '2.0' దర్శక నిర్మాతల మధ్య చిన్న వాదన జరిగినట్టుగా ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇరువర్గాలకి చెందిన సన్నిహితులు రంగంలోకి దిగి ఈ విభేదాలకు చెక్ పెట్టాలనీ.. '2.0' సినిమా రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించేటట్టు చూడాలని చూస్తున్నారట. మరి ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇలాంటివి జరగడం మాత్రం కామన్ అయినప్పటికీ ఇలాంటిది ఇంకా విడుదల కానీ ఈ సినిమాకి అంత మంచిది కాదేమో అంటున్నారు.