Advertisementt

సన్నీని అలా చూడగలమా..?

Fri 23rd Feb 2018 03:17 PM
sunny leone,twitter,photos,sensation  సన్నీని అలా చూడగలమా..?
sunny leone sensation with photos సన్నీని అలా చూడగలమా..?
Advertisement
Ads by CJ

సన్నిలియోన్‌లో ఎంతో నటనా ప్రతిభ ఉండి ఉండవచ్చు. కానీ ఆమెని ప్రేక్షకులు కేవలం సెక్సీ గర్ల్‌గా, పోర్న్‌స్టార్‌గానే చూస్తారు. ఆమె నటించిన చిత్రాలు చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు ఏమి ఆశించి వెళ్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు సన్ని నటనలో కూడా తన ప్రత్యేకత చాటుకుని, తాను కేవలం సెక్స్‌బాంబ్‌ని కాదని నిరూపించుకోవాలని చూస్తోంది. తాజాగా ఓ హర్రర్‌ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌లో దెయ్యంగా, వికృత స్వరూపంతో పళ్లు ఊడిపోయి, రెండు పళ్లు బయటికి వస్తూ కనిపించింది. 

ఇక తాజాగా ఆమె డంబుల్స్‌ని నెత్తి మీద పెట్టుకున్న ఫోటోని, పాముని మెడలో వేసుకున్న పిక్‌ని, ఏకంగా తాడుతో గాలిలో వేలాడుతూ నానా విన్యాసాలు చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. సాధారణంగా బరువైన డంబుల్స్‌ని ఎత్తాలన్నా, నెత్తిపైన పెట్టుకోవాలన్నా మగాళ్లే సందేహిస్తారు. కానీ సన్ని ఎంతో డేర్‌గా వీటిని తలపై పెట్టుకుని ఫోజిచ్చింది. ఇక తన మెడలో ఉన్న పాము మాత్రం డమ్మీ పాము అని, ఇంకా నయం.. దర్శకనిర్మాతలు నా మెడలో నిజమైన పాముని వేయలేదని జోక్‌ పేల్చింది. 

ఈ ఫోటోలన్ని ఓ టీవీషోకి సంబంధించినవి అని తెలుస్తోంది. దీంతో అందరు సన్నిలియోన్‌ని ఫన్నీలియోన్‌ అని పిలుస్తున్నారు. ఏది చేసినా తన ప్రత్యేకత ఉండేలా ఆమె చూసుకుంటోంది.

sunny leone sensation with photos:

sunny leone Twitter photos Creates Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ