Advertisementt

రంగస్థలం మెయిన్ పాయింట్ ఇదేనా..?

Thu 22nd Feb 2018 09:48 PM
rangasthalam,ram charan,thriller movie,no politics,sukumar,samantha  రంగస్థలం మెయిన్ పాయింట్ ఇదేనా..?
Ram Charan's Rangasthalam A Thriller రంగస్థలం మెయిన్ పాయింట్ ఇదేనా..?
Advertisement
Ads by CJ

సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుని దాదాపు ఏడాది పూర్తి కావొస్తుంది. ఇప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చేనెల 30 న విడుదలకు సిద్దమవుతుంది. సినిమా షూటింగ్ కి ఎక్కువ కాలం తీసుకున్నా.. పక్కాగా అందరూ మెచ్చేలా దీనికి మెరుగులు దిద్దుతున్నాడు సుకుమార్. ఈ సినిమా కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలోనే కొనసాగుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కథగా వస్తున్న ఈ సినిమా కథ ఇలానే ఉంటుందని.. అనేక రకాల ఊహాగానాలు బయటికొస్తున్నాయి.

రంగస్థలం సినిమాలో 1985  కాలంనాటి రాజకీయాల ప్రస్తావన వుంటుందనే విషయం ఈ మధ్యనే బయటికివచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా కథ మొత్తం థ్రిల్లర్ నేపథ్యంలోనే ఉంటుందని.. టాక్ బయటికి వచ్చింది. రంగస్థలంలో చిట్టిబాబు (రామ్ చరణ్) సోదరుడు హత్య గావింపబడడం... ఆ హత్యకు కారకులైన వారిని చిట్టిబాబు.. ఎలాపట్టుకున్నాడనేది మెయిన్ కథ అంటున్నారు. మరి హంతకుడిని చిట్టిబాబు పట్టుకోవడం అనేది పాత విషయమే అయినపప్పటికీ.. ఈ చిత్రంలో చెవిటివానిగా నటిస్తున్న రామ్ చరణ్ ఆ వినికిడి లోపంతో శత్రువులను ఎలా మట్టు బెట్టాడో అనేది కొత్తగా ఉండబోతుంది.

మరి ఇప్పటివరకు విడుదలైన రంగస్థలం టీజర్స్ లో రామ్ చరణ్ అల్లరి, సమంత చక్కదనం, నవ్వు లాంటివి చూపించిన సుకుమార్ రంగస్థలం ట్రైలర్ లో ఏమన్నా ఈ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని, యాక్షన్ సీన్స్ ని చూపిస్తాడేమో చూద్దాం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సోదరుడిగా ఆది పినిశెట్టి నటిస్తుండగా.. అనసూయ భరద్వాజ్ కీ రోల్ పోషిస్తుంది.

Ram Charan's Rangasthalam A Thriller:

This is the Rangasthalam movie Main Point

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ