తొలిప్రేమతో తొలి సినిమాతోనే ఇండస్ట్రీ చూపుని.... తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్న వెంకీ అట్లూరి తదుపరి సినిమా గురించిన చర్చలు మొదలైపోయాయి. గతంలో పెళ్లి చూపులు వంటి బంపర్ హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ఏమిటనే చర్చలు.... ఆ పెళ్లి చూపులు సినిమా హిట్ రావడంతోనే తెగ పుట్టుకొచ్చేశాయి. కానీ ఇంతవరకు తరుణ్ నెక్స్ట్ సినిమాపై ఎటువంటి క్లారిటీ లేదు. అలాగే నిన్నగాక మొన్న యూత్ఫుల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో మొదలెడతాడనే దాని మీద అసలు క్లారిటీనే లేదు. మరి ఇప్పుడు వెంకీ అట్లూరి తన తదుపరి సినిమా హీరో ఎవరనే దాని మీద చర్చలయితే స్టార్ట్ అయ్యాయి కానీ.. విషయం తేలడం లేదు.
కాకపోతే వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చెయ్యాలని చాలామంది యంగ్ స్టార్స్ ముందుకొస్తున్నారనే టాక్ మాత్రం వినబడుతుంది. కొత్తదనంతో తొలిప్రేమను తెరకెక్కించడమే కాకుండా కథ, కథనాలతో కట్టిపడేసిన వెంకీ డైరెక్షన్ స్కిల్స్ కి యంగ్ హీరోలు ముగ్దులవుతున్నారనే టాక్ వినబడుతుంది. అయితే వెంకీ అట్లూరి మాత్రం అక్కినేని కుర్రోడు అఖిల్ తో సినిమా చెయ్యాలని ఉత్సాహపడుతున్నాడట. మరి ప్రస్తుతానికి అఖిల్ ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. అఖిల్ డిజాస్టర్, హలో యావరేజ్ తో ఎటు వెళ్లాలో తెలియక క్రాస్ రోడ్స్ లో నిలబడిన అఖిల్ చూపు కూడా వెంకీ అట్లూరిపై పడిందంటున్నారు.
ఎందుకంటే స్టార్ డైరెక్టర్స్ వెంటపడి స్టార్ హీరో అవుదామనుకున్న అఖిల్ కి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అందుకే ఈసారి అఖిల్ తనకు నప్పే ప్రేమ కథలను, అలాగే యంగ్ డైరెక్టర్స్ చెప్పే కథలను వినాలని డిసైడ్ అయ్యాడట. అందులో భాగంగానే వెంకీ అట్లూరి అఖిల్ కి ఒక స్టోరీ లైన్ వినిపించడానికి రెడీ అవుతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి త్వరలోనే వెంకీ, అఖిల్ ని కలిసి స్టోరీ లైన్ వినిపించేసి... అఖిల్ కి గనక ఆ లైన్ నచ్చితే వెంటనే స్క్రిప్ట్ ని రెడీ చేసి సినిమాని పట్టాలెక్కించెయ్యాలని చూస్తున్నాడట.