Advertisementt

అనుష్క లవర్ హిజ్రాగా అదుర్స్!

Thu 22nd Feb 2018 07:32 PM
unni mukundan,chanakya tantram,transgender,malayalam,karishma  అనుష్క లవర్ హిజ్రాగా అదుర్స్!
Bhaagamathie hero is hijra Karishma అనుష్క లవర్ హిజ్రాగా అదుర్స్!
Advertisement
Ads by CJ

గతంలో లేడీ గెటప్‌లలో నటించిన హీరోలు ఎందరో ఉన్నారు. 'చిత్రం భళారే విచిత్రం'లో సీనియర్‌ నరేష్‌, 'భామనే సత్యభామనే' చిత్రంలో కమల్‌హాసన్‌, 'మేడమ్‌' చిత్రంలో రాజేంద్రప్రసాద్‌లు మెప్పించారు. అలాగే ఇతర భాషల్లో, బాలీవుడ్‌లో కూడా కొందరు ఆడవేషాలు వేశారు. ఇక పరేష్‌ రావల్‌తోపాటు కోటశ్రీనివాసరావు కూడా 'రెండిళ్లపూజారి' చిత్రంలో హిజ్రా అయిన విలన్‌గా నటించాడు. 'కాంచన' చిత్రంలో శరత్‌కుమార్‌ హిజ్రా పాత్రతో మెప్పించాడు. ఇక ప్రస్తుతం తమిళ యంగ్‌స్టార్‌ విజయ్‌ సేతుపతి శిల్ప అనే ట్రాన్స్‌ జెండర్‌ పాత్రను పోషిస్తున్నాడు. 'సూపర్‌డీలక్స్‌'గా రానున్న ఈ చిత్రంలో ఆయన ఎర్రచీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని చేస్తున్న పాత్రకి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్‌ అవుతోంది. 

మరోవైపు ఇలాంటి ప్రయోగమే మలయాళంలో కూడా జరుగుతోంది. ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌ నటించిన 'జనతాగ్యారేజ్‌' చిత్రంలో విలన్‌గా కనిపించి, 'భాగమతి'లో కూడా అదరగొట్టిన ఉన్నిముకుందర్‌ కీలకపాత్రలో మలయాళంలో 'చాణక్య తంత్రం' అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో ఉన్నిముకుందన్‌ కరిష్మా అనే ఓ హిజ్రా పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం యూనిట్‌ ఇందులోని ఉన్నిముకుందన్‌ లుక్‌ని విడుదల చేయడంతో ఇది మాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్‌ చేయనున్నారు. ఇక యూనిట్‌ ఈ చిత్రం లుక్‌నే కాదు. మేకింగ్‌ వీడియోని కూడా రిలీజ్‌ చేసింది. 

ఇందులో ఆ పాత్ర కోసం ఉన్నిముకుందన్‌ పడిన కష్టం తెలుస్తోంది. మిరాకిల్‌ ప్రొడక్షన్స్ బేనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి కన్నన్‌ తామరకుల్లం దర్శకుడు. శివదా, శృతిరామచంద్రన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనూప్‌మీనన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుందో వేచిచూడాల్సివుంది.

Bhaagamathie hero is hijra Karishma:

Unni Mukundan Chanakya Tantram movie in Malayalam and the man is playing a transgender in this movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ