ప్రెస్‌మీట్లు, బహిరంగ సభలు, ప్రసంగాలు చేసినా కూడా ఒక పొలిటికల్ చిత్రం ద్వారా, అందులోని సీన్స్, డైలాగ్స్ ద్వారా తమ విధివిధానాలు, తమ భావాలు, తమ అంతరంగం, తమ అభిప్రాయాలను ప్రేక్షకులకు చేరవేయడంలో సినిమాలే బలమైన మాద్యమంగా నిలుస్తాయి. ఇక పవన్ ఆమధ్య ఓ ప్రెస్‌మీట్ లో అక్టోబర్ నుంచి ప్రజల్లోకి వస్తానని చెప్పాడు. కానీ 'అజ్ఞాతవాసి' వల్ల అది ఆలస్యం అయింది. అంటే వచ్చే ఎన్నికలలోపు తాను చేయబోయే చివరి చిత్రం 'అజ్ఞాతవాసి'యేనని పవన్‌కే కాదు.. సామాన్య ప్రేక్షకులకు, అభిమానులకు కూడా తెలుసు. కానీ పవన్ తనకి ప్లస్ అయిన విషయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ భావాలను కేవలం మీడియా ద్వారానే చెప్పగలరు. కానీ పవన్ విషయం వేరు. ఆయనకు రాజకీయాలలోకి రాక ముందే కోట్లాది అభిమానులు ఉన్నారు. అది సినీ స్టార్‌గా పవన్‌కి ఉన్న పెద్ద ఆయుధం.
కానీ ఆ ఆయుధాన్నిఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాటి ఎమ్జీఆర్ నుంచి ఎన్టీఆర్ వరకు రాజకీయ ప్రవేశాలకు ముందు తమ చిత్రాల ద్వారా తామేం చేయాలనుకుంటున్నామో తెలిపారు. ఎన్టీఆర్ 'నాదేశం, సర్దార్‌పాపారాయుడు, బొబ్బిలిపులి' వంటివి దీనికి ఉదాహరణ. అదే పవన్ తాను చేసిన 'అజ్ఞాతవాసి' స్థానంలో ఓ పొలిటికల్ మైలేజ్ తీసుకొచ్చే చిత్రం చేసి ఉంటే ఆయనకు బాగా హెల్ప్‌అయ్యేది. ఇక కొరటాల శివ పవన్‌కోసం అలాంటి ఓ కథను సిద్దం చేసినా పవన్ చేయలేదు. కానీ ఇప్పుడు అదే కొరటాల శివ మహేష్‌ని సీఎంగా చూపిస్తూ, రాజకీయాలంటే ఎలా ఉండాలి? అని మహేష్ క్యారెక్టర్ ద్వారా చూపించనున్నాడు. అదే చిత్రాన్ని పవన్ చేసి ఉంటే ఎంత బాగుండేది?ఆయనకి ఎంతగా హెల్ప్ అయ్యేది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహేష్‌కి పాలిటిక్స్ నచ్చవు. ఆయనకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం కూడా లేదు.
కానీ పవన్ పరిస్థితి అది కాదు. మరి పవన్ 'భరత్ అనే నేను' చిత్రం చేసి ఉంటే నిజంగానే ఎన్నికల ముందు ఆయనకు ఆ చిత్రం బాగా హెల్ప్ అయ్యేదే అని చెప్పవచ్చు. ఇక కమల్, రజనీ వంటివారే అలాంటి చిత్రాలు చేయాలని భావిస్తున్నప్పుడు స్టార్‌గా తనకున్న ప్లస్‌పాయింట్‌ని పవన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడనే చెప్పవచ్చు.