రానా దగ్గుబాటి తన కెరీర్ నుంచి విభిన్న పంధాలోనే వెళ్తున్నాడు. మొదటి చిత్రం 'లీడర్' మాత్రమే కాకుండా 'కృష్ణం వందే జగద్గురం' వంటి చిత్రాలతో పాటు ఏ భాషలోనైనా సరే తన పాత్ర నిడివి ఎంత అనేది పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈయన ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 'బాహుబలి'లో భళ్లాలదేవుడు గానే కాక 'ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి' వంటి చిత్రాలలో నటించిన ఈయన 'రుద్రమదేవి'లో కూడా నటించాడు. ప్రస్తుతం అదే దర్శకుడు గుణశేఖర్ రానా ప్రధాన పాత్రలో 'హిరణ్యకస్యప' అనే చిత్రానికి ఓకే చెప్పాడు.
ఇది భక్త ప్రహ్లాదుడి స్టోరీనే అయినప్పటికీ హిరణ్యకస్యపుణి కోణంలో సాగుతుంది. 150కోట్లతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గుణ టీం వర్క్స్ బేనర్‌తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా తండ్రి సురేష్‌బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో కూడా పలు భాషలకి చెందిన నటీనటులను తీసుకుని తెలుగుతో పాటు ఇతరభాషల్లో కూడా క్రేజ్ తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ మధ్య వరుసగా కమర్షియల్ చిత్రాలతో వెనుకబడి పోయి రూట్ మార్చిన గుణశేఖర్‌కి ఈ చిత్రమైనా ఆర్దికంగా కూడా హ్యాపీ ప్రాజెక్ట్ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది.