Advertisementt

నేను తిడితే ప్రేమిస్తున్నాననే అర్ధం!

Wed 21st Feb 2018 10:20 PM
rani mukerji,aditya chopra,husband,love,curse  నేను తిడితే ప్రేమిస్తున్నాననే అర్ధం!
Rani Mukerji Shows Love on Her Husband నేను తిడితే ప్రేమిస్తున్నాననే అర్ధం!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఉంటూ నాలుగేళ్ల కిందట యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌కి చెందిన ఆదిత్యచోప్రాను వివాహం చేసుకుంది రాణీముఖర్జీ. వీరికి అధిర అనే పాప కూడా ఉంది. చాలా కాలం తర్వాత ఈమె బాలీవుడ్‌లో 'హిచ్‌కి' అనే చిత్రంలో నటిస్తోంది. మాట్లాడేటప్పుడు 'హిచ్‌కి' అనే కొత్త శబ్దం చేసే టీచర్‌ తన స్టూడెంట్స్‌ని ఎలా తీర్చిదిద్దింది? అనే పాయింట్‌పై ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలలో ఆమె బిజీగా ఉంది. ఆమె తాజాగా నేహా దూపియా నిర్వహించిన చిట్‌ చాట్‌లో మాట్లాడింది. 

ఈ షోకి ఆమె ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీతో హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవును... నేను నా భర్తని తిడతాను, ధూషిస్తాను. అది ద్వేషంతో కాదు. ప్రేమతో. ఆయన చేసే మంచి పనులను సంతోషంగా తిడతాను. నేను ఎవరినైనా తిట్టానంటే అది వారిపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. నా తిట్లలో ప్రేమ తప్ప ద్వేషం ఉండదు. 'ముజ్‌సే షాదీ కరోగీ' చిత్రం సమయంలో నాకు ఆదిత్య చోప్రాతో పరిచయం కలిగింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 

నాకు ఆదిత్యకు పెద్దగా ప్రచారాలు, ఆర్బాటాలు నచ్చవు. అందుకే కేవలం 12 మంది ముఖ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఇతర సెలబ్రిటీ కిడ్స్‌ తరహాలో మా పాప ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం నాకిష్టం ఉండదు. అందుకే తనను ఎక్కువగా ఫొటోలు తీసేందుకు, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేందుకు ఇష్టపడనని తెలిపింది.

Rani Mukerji Shows Love on Her Husband:

Rani Mukerji: I curse my husband every day, but out of love

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ