తేజ దర్శకత్వంలో బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రస్తుతం భుజానికి అయిన చికిత్సతో రెస్ట్ లో ఉన్న బాలయ్య తన తండ్రి బయోపిక్ కోసం అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టించేశాడు. ఈ సినిమా కోసం బాలకృష్ణ దాదాపుగా 66 గెటప్స్ లో కనబడతాడనే ప్రచారం ఉంది. అయితే సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకంగా నటించమని ఒక హీరోయిన్ ని అడిగారట.
కానీ ఆ హీరోయిన్ మాత్రం బసవతారకం పాత్రలో చేయలేనని చెప్పేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నాని నిర్మాతగా తెరకెక్కిన 'అ!' సినిమాలో కృష్ణ పాత్రలో నటించి ఆకట్టుకున్న నిత్యా మీనన్. ప్రస్తుతానికి నిత్యా మీనన్ చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమి లేవు. అందుకేనేమో బాగా ఒళ్ళు పెంచేసి ఫిట్నెస్ ని గాలికొదిలేసినట్లుగా కనబడుతుంది. బాగా బరువున్న నిత్యా మీనన్ ఇప్పుడు హీరోయిన్ గా తమ సినిమాల్లో ఎవరు అవకాశాలు ఇచ్చేలా కనబడడం లేదు.
మరి అలాంటి నిత్యా ఇప్పుడు అందివచ్చిన అవకాశం ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే అవకాశాన్ని వదులుకోవడమెలా.. అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ విషయమై నిత్యా ఒక ఇంటర్వ్యూ లో స్పందించింది. కేవలం తనకి ఉన్న వ్యక్తిగత ఇబ్బందుల వలనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని చెప్పింది కానీ.. అది సరైన కారణంగా అనిపించలేదు. ఇకపోతే ఇప్పుడు ఈ పాత్రని నిత్యా రిజెక్ట్ చెయ్యడంతో ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టింది.