ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తారక్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. అలానే ఇప్పుడున్న బరువు కన్నా కొద్దిగా తగ్గి.. స్లిమ్ గా కనిపించనున్నాడు తారక్.
ఇందుకోసం స్పెషల్ ట్రైనర్ ని కూడా పెట్టుకున్నాడు. లాయ్డ్ స్టీవెన్స్ అనే ట్రైనర్ శిక్షణలో వర్కవుట్స్ చేస్తున్న ఒక వీడియోని స్టీవెన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ కసరత్తులతో పాటే తారక్ కోసం స్పెషల్ డైట్ ను డిజైన్ చేశారట. సినిమా కంప్లీట్ అయేదాకా ఆ డైట్ నే ఫాలో అవుతాడట తారక్.
మరి ఇంతలా కష్టపడుతున్న తారక్ లుక్ చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. అక్టోబర్ ఎండింగ్ కి సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు త్రివిక్రమ్.