కొంతకాలం కిందట నాకు మంచి లైఫ్ పార్ట్‌నర్ కావాలి.. అంటూ ఇంటర్నెట్‌లో కనిపించి ఆర్య హడావుడి చేసి ఓ వెబ్‌సైట్ పేరు, ఈమెయిల్స్‌ని ఇచ్చాడు. నాడు ప్లేబోయ్‌గా పేరొందిన ఆర్యని సపోర్ట్ చేస్తూ తెలుగు ప్లేబోయ్‌లైన రానా దగ్గుబాటి, అల్లు శిరీష్ వంటి వారు దానిని ప్రమోట్ చేశారు. నాడు అది కేవలం ఓ చానెల్‌లో ప్రసారం కానున్న ఓ షోకి సంబందించిన ప్రమోషన్‌లో భాగంగానే ఆర్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని పలువురు అనుమానించారు. ఎట్టకేలకు అదే నిజమైంది. వయాకామ్ 18 సంస్థ తాజాగా తమిళంలో కలర్స్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్‌ని స్థాపించింది. ఈ సందర్భంగా చానెల్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ఏప్రిల్‌లో తమ చానెల్‌లో 'ఇంగవీటు మాపిళ్లై' అనే స్వయంవరం ప్రోగ్రాంను ప్రసారం చేయనున్నామని ఇందులో పాల్గొనేందుకు ఆర్య ఒప్పుకున్నాడని తెలిపాడు.
ఆర్యని వివాహం చేసుకోవడానికి ఆరువేల మంది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోగా, 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, దీనిని షార్ట్ లిస్ట్ చేసి మొత్తం 18 మందిని ఎంపిక చేశామని తెలిపాడు. అంటే ఈ షో 18 వారాల పాటు సాగుతుందా? అనే అనుమానం వస్తోంది. ఇక ఫైనల్ లిస్ట్ చేసిన వారితో పాటు ఆర్య ఇందులో పాల్గొంటాడని ఆయన తెలిపారు. ఇక నిన్నటివరకు సంసారాలను చక్కదిద్దే కార్యక్రమాలు అన్ని చానెల్స్‌లో ప్రసారమై అసలు సమస్యని పరిష్కారం చేస్తున్నారా? మరింతగా వారిని విడిపోయే లాగా రెచ్చగొడుతున్నారా? అసలు వారు నిజమైన భార్యాభర్తలేనా? ఎవరికైనా స్క్రిప్ట్ రెడీ చేసి నాటకాలు ఆడిస్తున్నారా? వంటి పలు అనుమానాలు వచ్చాయి.
మరో దారుణమైన విషయం ఏమిటంటే.. ఇందులో జడ్జిలుగా వ్యవహరించిన పలువురు సినీ సెలబ్రిటీలు తమ కాపురాలే సరిగా లేని వారు కావడం, తాగేసి షోలకి వచ్చి పాల్గొనే దంపతులను బూతులు తిట్టడం వంటివి చేసేసరికి ఈ షోలకు మానవ హక్కుల సంఘాల దాకా కేసులు వెళ్లాయి. ఇప్పుడు ఈ కొత్తగా స్వయంవరం కార్యక్రమాలు కూడా హిట్టయితే ఇక వీటిని అన్ని చానెల్స్‌లో, అన్నిభాషల్లో విరివిగా చూడవచ్చు. మొత్తానికి జనాల వీక్‌నెస్‌తో చానెల్స్ టీఆర్పీల కోసం ప్రయత్నిస్తే శవాలను బొరుగులు ఏరుకుంటున్నాయనే భావన అందరిలో కలుగుతోంది.