ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్లకు ఇతరులకు మధ్య ముడిపెడుతూ ఎఫైర్లు సృష్టిస్తూ ఉండటం సహజమే. అయినా నటీనటుల మధ్య ఎఫైర్ వార్తలు సహజంగా వస్తాయి కానీ ఒక దర్శకుడితో హీరోయిన్‌కి ముడిపెట్టి వార్తలు రావడం మాత్రం అరుదే. అలా వచ్చిన వారిలో కృష్ణవంశీ, రమ్యకృష్ణలు వివాహం చేసుకున్నారు. ఇక ఎ.ఎల్.విజయ్-అమలాపాల్‌లు వివాహం చేసుకుని స్వల్ప కాలంలోనే విడిపోయారు. ఇక ప్రస్తుతం నయనతార-విఘ్నేశ్‌శివన్‌ల విషయంలో కూడా ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. ఇక విషయానికి వస్తే కొద్దిరోజుల ముందు వచ్చిన 'టచ్ చేసి చూడు' చిత్రం డిజాస్టర్ కావడంతో హీరోయిన్ రాశిఖన్నా కంగారు పడింది. కానీ 'జై లవకుశ' తర్వాత ఆమెకి మెగా హీరో వరుణ్‌తేజ్‌తో నటించిన 'తొలిప్రేమ' చిత్రం పెద్ద విజయాన్ని అందించడమే కాదు.. 'టచ్ చేసి చూడు' చిత్రం చేసిన డ్యామేజీని మాములుగా చేసింది.
ఈ చిత్రం ద్వారా ఆమె బలమైన సన్నివేశాలలో కూడా బాగా నటించగలనని, అందం, గ్లామర్, బబ్లీనెసే కాదు...తనలో నటనను పడించే సత్తా ఉందని కూడా నిరూపించుకుంది. ఇక ఈమెకి తాజాగా నితిన్ హీరోగా దిల్‌రాజు నిర్మాతగా సతీష్‌వేగ్నేష్ దర్శకత్వంలో రూపొందనున్న 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో కూడా చాన్స్ లభించిందట. ఇక 'సుప్రీమ్' వంటి హిట్ చిత్రం తర్వాత ఈమె దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'రాజా ది గ్రేట్' చిత్రంలో ఓ ప్రత్యేక పాటని చేసింది. దాంతో దర్శకుడు అనిల్ రావిపూడితో ఈమెకి ఎఫైర్ ఉందని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా వాటికి రాశిఖన్నా సమాధానం ఇచ్చింది.
నాకు 'సుప్రీమ్' వంటి కమర్షియల్ హిట్‌ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ చిత్రంలో నాకెంతో ఇష్టమైన ఫ్రెండ్ రవితేజ నటిస్తుండటంతో అడిగిన వెంటనే నటించడానికి ఒప్పుకున్నాను. ఈ వార్తలు నన్నేమి బాధలు పెట్టలేదు గానీ నిజమైన విషయం రాస్తే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఇలాంటి వార్తలను ఎందుకు పుట్టిస్తారో తెలియదు. కేవలం వీడియో వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలు వేయడం నేను ఖండిస్తున్నానని తెలిపింది.