స్టార్ డైరెక్టర్స్ చాలా వరకు తమకు నచ్చిన టీంతోనే కంటిన్యూ అయిపోతూ వెళ్ళిపోతారు. పాత వాళ్లతోనే పని చేయటానికి ఇష్టపడుతుంటారు. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా అంతే ఒకప్పుడు ఒకే టీంతో వరుసగా సినిమాలు చేసేవాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవితో.. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల త్రివిక్రమ్ టీంలో రెగ్యులర్ గా ఉండేవాళ్లు. కానీ ‘అఆ' సినిమా నుండి పాత వాళ్లకి టాటా చెప్పి కొత్త వాళ్లకి హాయ్ చెప్పాడు.
‘అఆ' టైంలో మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ తో.. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యన్ తో వర్క్ చేసాడు. ‘అజ్ఞాతవాసి’కి మళ్లీ టెక్నీషియన్లు మార్చేశాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తే మణికందన్ ఛాయాగ్రహణం అందించాడు.
మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ అనుకుంటున్నాడు కానీ ఇది ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. సినిమాటోగ్రాఫర్ అయితే కన్ఫమ్ అయ్యాడు. మనం, ఊపిరి, ధృవ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన పి.ఎస్.వినోద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నట్లు సమాచారం. పి.ఎస్.వినోద్ తో త్రివిక్రమ్ పని చేయడం ఇదే తొలిసారి. మామూలుగానే వినోద్ విజువల్స్ చాలా అందంగా.. ఆహ్లాదంగా ఉంటాయి. అలానే త్రివిక్రమ్ సినిమాలు కూడా విజువల్స్ చాలా బాగుంటాయి. ఇక వీరిద్దరి టేస్టు కూడా కలిస్తే ఔట్ పుట్ చాలా బాగుంటుందనడంలో సందేహం లేదు.