ఒకవైపు జీఎస్టీ వ్యవహారం, సామాజిక కార్యకర్త దేవి పోలీసుల ఫిర్యాదు. ఐద్వానేత మణి ఎదురుదాడితో ఖచ్చితంగా ఇంతకాలం నాకు భయం, జాలి, కోపం వంటి ఏ ఎమోషన్స్ లేవని చెబుతున్న వర్మకి భయం అనే ఎమోషన్ మొదటి సారి తెలిసిందనే అంటున్నారు. తాను ఈ చిత్రాన్ని స్కైప్‌లో చేశానని, తాను దర్శకత్వం చేయలేదని చెప్పిన వర్మకి పోలీసులు ల్యాప్‌టాప్‌లో టైటిల్ కార్డ్స్‌లోఉన్న వర్మ పేరు, ఇక మిల్కోవాకి ఆయన సూచనలిస్తున్న ఫొటోని పోలీసులు చూపించి వర్మకి పోలీసులు చుక్కలు చూపించారనే తెలుస్తోంది. ఇక ప్రతి విషయానికి ఏదో ఒక లాజిక్‌తెచ్చే వర్మ పోలీసుల విచారణలో కూడా అలాగే చేయాలని భావించినా, ఆయనకు విషయం, తత్వం బోధపడటంతో మౌనం లేదా తర్వాత చెబుతాను వంటి మాటలే ఎక్కువగా చెప్పాడట.
ఇక ఐద్వా నాయకురాలు మణికి వర్మ సారి చెప్పినా కూడా ఆమె సెలబ్రిటీలంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. వర్మ పది మందిని చెడగొడుతున్నాడు ఇలాంటి వారికి నిర్భయ చట్టంను ప్రయోగించాలని గట్టిగా తన వాదన వినిపించింది. బహుశా ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం, తానేమీ భయపడలేదని నిరూపించుకునేందుకు ఆయన పవన్ ప్రస్తావనతో ట్వీట్స్ చేశాడు. ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించాడు. పవన్‌కళ్యాణ్‌ని పోర్న్‌లానే ఇష్టపడతానన్న వర్మ అభిమానులను మీరు పవన్‌ని ఇష్టపడతారా? పోర్న్‌ని ఇష్టపడతారా? అని ప్రశ్నించాడు. పోర్న్ పవన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని సృష్టించాడు. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పోర్న్ కళ్యాణ్ అని వర్మ చేసిన ట్వీట్‌కి కత్తిమహేష్ కూడా స్పందించాడు.
పోర్న్ కళ్యాణ్ శబ్దం బాగుందని, ఈ పేరును, శబ్దాన్ని విని పవన్ కూడా సంతోషిస్తాడు అనే అర్ధంతో ట్వీట్ చేశాడు. పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో అద్బుతం చేస్తుందని నమ్ముతున్నానని, కానీ నిజం ఎప్పుడు హర్ట్ చేస్తుందంటూ పవన్‌ని ఎద్దేవా చేశాడు. మొత్తానికి పోలీసులు ఏమి అడిగారు? తానేం సమాధానం చెప్పాడు? అనేది డైవర్ట్ చేయడానికే వర్మ ఈ పోర్న్‌కళ్యాణ్ ట్వీట్ చేశాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఈ విషయంలో ఆయన ఎంత మేరకు విజయం సాధిస్తాడో వేచిచూడాల్సివుంది.