సాధారణంగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అంటారు. అదే శృతిహాసన్ విషయానికి వస్తే ఆమె మాటలే కాదు.. చేతలకు కూడా అర్ధాలు వేరు అనే చెప్పాలి. ఈమె ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బ్రిటన్‌కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్స్‌లే తో డేటింగ్‌లో ఉంది. కేవలం డేటింగ్ అని మనం అనుకుంటున్నాం గానీ ఇద్దరు సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్, బాలీవుడ్ మీడియా గట్టిగా చెబుతోంది. శృతిహాసన్ కూడా మైఖేల్‌కోర్స్‌లే తనకి ఎంత ఇష్టమో, తనకు ఎంత స్పెషలో ప్రతి విషయంలోనూ నిరూపిస్తూనే ఉంది. కాకపోతే ఆయన విషయం తన వ్యక్తిగత విషయమని, తన వ్యక్తిగత విషయాలను తాను బయటికి చెప్పడం ఇష్టంలేదని అంటుంది. అయినా ఇది బహిరంగ రహస్యమే. ఆ మధ్య తన ప్రియుడిని తన తండ్రి కమల్‌హాసన్‌కి పరిచయం చేయడం, తర్వాత ముంబైలోని తనతల్లి సారిక పర్మిషన్ తీసుకోవడం. మేఖేల్ ఎక్కడికి వెళ్లినా తాను కూడా ఉంటూ కెమెరాలకు చిక్కడం కామన్ అయిపోయాయి.
ఇక ఇటీవల మైఖేల్ శృతిహాసన్, కమల్‌హాసన్‌లతో కలిసి ఓ వివాహ వేడుకకు తమిళ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యాడు. దాంతో త్వరలో పెళ్లి గ్యారంటీ అనుకున్నారు. అయినా పిల్లలని కనడానికి పెళ్లే చేసుకోవాలా? అని ప్రశ్నించే ఆమె అంతరంగం అందరికీ తెలిసిన విషయమే. తన తండ్రి కమల్ లాగా సహజీవనం మీద తప్ప ఈమెకి పెళ్లి మీద పెద్ద నమ్మకం లేనట్లే ఉంది. ఇక ఇటీవల తన బర్త్‌డేని కూడా లాస్‌ఏంజెల్స్‌లో తన ప్రియుడు, ముఖ్యమైన స్నేహితులతో జరుపుకుంది. తాజాగా తన ప్రియుడు మైఖేల్ బర్త్‌డే సందర్భంగా మాత్రం ఆమె అతడిని కలవలేకపోయింది. దాంతో ఆయనపై తన ప్రేమను చాటుతూ ఓ ట్వీట్ చేసింది.
'మై బెస్ట్ ఫ్రెండ్, పార్టనర్ ఇన్ క్రైమ్. నాతో పాటు ప్రపంచాన్ని చుట్టొచ్చేందుకు ఇష్టపడే తోటి ప్రయాణికుడు. ప్రతి విషయంలోనూ నాతో పాటు నవ్వుతూ ఉండే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే. ఈ సంతోష సమయంలో నీ చెంత లేనందుకు క్షమించు.. ఫన్నియెస్ట్ మ్యాన్ ఐ నో... హార్ట్ ఆఫ్ గోల్డ్, బర్త్‌డే బాయ్' అంటూ తనకి వచ్చిన విశేషణాలన్నింటిని తన ప్రియుడిని పొగడటానికి ఉపయోగించుకోవడం బట్టి వారి మధ్య బంధం ఫెవికాల్ కంటే గట్టిదని చెప్పవచ్చు.