Advertisementt

చరణ్ కోసం స్టూడెంట్స్ వెయిటింగ్..!!

Tue 20th Feb 2018 05:49 PM
ram charan,rangasthalam,release date,students,marchi 30  చరణ్ కోసం స్టూడెంట్స్ వెయిటింగ్..!!
Rangasthalam Ready for Students చరణ్ కోసం స్టూడెంట్స్ వెయిటింగ్..!!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది ఒక భారీ డిజాస్టర్ తో టాలీవుడ్ బాక్సాఫీసు బోణి కొట్టింది. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం ప్లాప్ తో మొదలైన బాక్సాఫీసు నిన్నగాక మొన్న నాని 'అ!' సినిమా వరకు ఏడు వారాలపాటు ప్రతి వారం బాక్సాఫీసు కళకళలాడింది. సంక్రాంతికి 'అజ్ఞాతవాసి, జై సింహ, రంగుల రాట్నం' విడుదలైతే ఆ తర్వాతి వారం బాక్సాఫీసు ఖాళీ అయినా జనవరి 26 న అనుష్క 'భాగమతి'తో కుమ్మేసింది. అలాగే ఫిబ్రవరిలో 'ఛలో' సినిమా, తొలిప్రేమ 'అ!' సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా 'ఇంటిలిజెంట్, గాయత్రీ, మనసుకు నచ్చింది' సినిమాలు ప్లాప్ అయ్యాయి.

మరి సంక్రాంతి తర్వాత ఒక్క భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు కూడా రాని బాక్సాఫీసుకు మరొక్క నెల కూడా అదే సీన్ రిపీట్ కాబోతుంది. వచ్చే వారం తమిళ విక్రమ్ స్కెచ్ తో దిగుతున్నాడు కానీ... మరో సినిమా ఏమి విక్రమ్ కి పోటీ ఇవ్వడం లేదు. అలాగే మార్చి మొదటి మూడు వారాల్లో కూడా ఓ అన్నంత సినిమాలేమి బాక్సాఫీసు వద్దకు రావడం లేదు. కారణమేమిటో తెలుసా... పరీక్షలండి. ఫిబ్రవరి, మార్చి పరీక్షల సమయం కావడంతో నిర్మాతలెవరు తమ సినిమాలను విడుదల చేసే సాహసం చెయ్యరు. ఫిబ్రవరి చివరి నుండి మార్చి ఎండ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ 10 వ తరగతి, ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల సమయం.

అందుకే సినిమాలేమి విడుదలకావు. ఏదో చిన్న సినిమాలు తప్ప. ఇక మార్చి ఎండ్ రామ్ చరణ్ రంగస్థలం విడుదల వరకు చెప్పుకోదగ్గ సినిమాలేమి రావడం లేదు. మార్చి 30 న పక్కాగా రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్స్ తో భారీ హైప్ లో ఉన్న రంగస్థలంతో రామ్ చరణ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.. అందుకే చరణ్ కోసం ఇక్కడ వెయిటింగ్ అండి అంటున్నారు.

Rangasthalam Ready for Students:

Rangasthalm Gets Good Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ