Advertisementt

ఎన్టీఆర్‌ వార్తకు బలం చేకూరుతోంది!

Mon 19th Feb 2018 11:45 PM
jr ntr,mother,shalini,temple,sri mavullammavaru,bhimavaram  ఎన్టీఆర్‌ వార్తకు బలం చేకూరుతోంది!
Jr NTR Mother Shalini surprised everyone ఎన్టీఆర్‌ వార్తకు బలం చేకూరుతోంది!
Advertisement
Ads by CJ

నిన్నటి నుంచి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరోసారి నాన్న కాబోతున్నాడనే వార్త బాగా వైరల్‌ అవుతోంది. ఎన్టీఆర్‌ శ్రీమతి లక్ష్మీప్రణతి ప్రస్తుతం గర్బవతి అని సమ్మర్‌లో ఆమె మరో బిడ్డకు జన్మనివ్వనుందని అంటున్నారు. అంటే జూనియర్‌ ఫ్యామిలీలోకి మరో మెంబర్‌ ఎంటర్‌ అవుతున్నాడు. మరి అది బాబా, పాపా అనేది వేరే విషయం. ఇక ఎన్టీఆర్‌కి 2015లో అభయ్‌రామ్‌ పుట్టాడు. అభయ్‌ పుట్టిన తర్వాత ఎన్టీఆర్‌కి బాగా కలిసొచ్చింది. అప్పటివరకు వరుస ఫ్లాప్‌లో ఉన్న ఆయన వరుస విజయాలు సాధిస్తూ తన క్రేజ్‌ని, మార్కెట్‌ని రెండింతలు పెంచుకున్నాడు. ఇక లక్ష్మీప్రణతితో వివాహం, అభయ్‌రామ్‌ పుట్టిన తర్వాత తనలో మానసికంగా కూడా ఎంతో మెచ్యూరిటీ వచ్చిందని చెబుతుంటాడు. ఇక ఎన్టీఆర్‌ మరోసారి నాన్న కాబోతున్నాడనే విషయం ఇప్పటికీ ఓ గాసిప్‌గానే వినిపిస్తోంది కూడా అధికారిక ప్రకటన రాలేదు. 

అయితే తాజాగా ఎన్టీఆర్‌ తల్లి, హరికృష్ణ భార్య అయిన షాలిని భీమవరం వెళ్లింది. అక్కడి తన స్నేహితులతో కలిసి భీమవరం గ్రామ దేవత, ఇలవేల్పు అయిన మావూళ్లమ్మని దర్శించుకుంది. ఈ సందర్భంగా దేవాలయ సిబ్బంది ఆమెకి స్వాగతం పలుకగా, పూజారులు ఆమె పేరున పూజలు చేసి అమ్మ ఆశీర్వాదాలను అందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ తల్లి అమ్మవారికి 350 గ్రాముల వెండి గిన్నెను అందజేశారు. ఎన్టీఆర్‌ రెండోసారి తండ్రి కాబోతున్నాడని వార్తలు వస్తున్న నేపధ్యంలోనే ఆమె అమ్మవారి మొక్కును తీర్చుకుందని అంటుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 

మరోవైపు ఎన్టీఆర్‌ వచ్చే నెలలో త్రివిక్రమ్‌తో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. దీని తర్వాత ఆయన రామ్‌చరణ్‌తో కలిసి రాజమౌళి తీసే మల్టీస్టారర్‌లో బిజీ కానుండటంతో బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ని ఆయన చేయడం లేదని సమాచారం. అందునా అది తనకు రెండో సంతానం కలిగే సమయం కావడం విశేషం. దాంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఎన్టీఆర్‌ స్థానంలో నేచురల్‌స్టార్‌ నానితో రెండో సీజన్‌ని హోస్ట్‌ చేయించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

Jr NTR Mother Shalini surprised everyone:

Jr NTR Mother visiting the Sri Mavullammavari Temple in Bhimavaram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ