బాలీవుడ్‌లో ఎందరో నటీనటుల వారసులు, వారసురాళ్లు తెరంగేట్రం చేసినా కూడా కపూర్ ఫ్యామిలీ నుంచి రంగుల ప్రపంచంలోకి తొలిగా వచ్చిన హీరోయిన్‌గా కరిష్మాకపూర్ పేరు వినిపిస్తుంది. తన అందచందాలతో, అమాయకమైన మోముతో ఆమె అభినయించిన చిత్రాలెన్నో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆమె కాలంలో ఆమె స్టార్ హీరోయిన్‌గా తన హవా చాటింది. ఇక ఈమె తర్వాత ఆమె సోదరి కరీనా కపూర్ బాలీవుడ్‌ని ఏలింది. తొలిసారిగా బాలీవుడ్‌లో సైజ్‌జీరో అందాలను సంతరించుకుని, హీరోయిన్లు స్లిమ్‌గా ఎలా ఉండాలో ప్రేక్షకులకు రుచి చూపింది. ఆమె పుణ్యమా అనే ఆ తర్వాత హీరోయిన్లు అందరు ఆమె బాటలో సైజ్‌జీరో మాయలో పడిపోయారు. ఇక ఈ ఇద్దరు సోదరీమణులు ఇప్పటివరకు కలిసి వెండితెరపై నటించలేదు. కేవలం ఓ వాణిజ్య ప్రకటనలో మాత్రమే కలిసి కనిపించారు.
ఇక తమ ఇద్దరికి సూట్ అయ్యే కథ వస్తే వెండి తెరపై స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని వారు పలుసార్లు తెలిపారు. కానీ వారిద్దరికి సూట్ అయ్యే స్టోరీ ఇప్పటి వరకు రాలేదు. అయినా ఈ అక్కాచెల్లెళ్లను ఒకే వేదికపై చూడాలని బాలీవుడ్‌లోని వీరి అభిమానులు ఎంతో ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అలా ఎదురు చూపులు చూస్తున్న వారి కోరిక త్వరలో నెరవేరనుందని సమాచారం. వచ్చే నెలలో వచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ ఇద్దరు కలిసి వేదికను పంచుకోనున్నారు.
ఈ సందర్భంగా కరిష్మాకపూర్ కపూర్ ఫ్యామిలీ వంటి బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తాను నటిగా ఎదుర్కొన్న అనుభవాలు, తీపి గుర్తులను ప్రస్తావించనుండగా, కరీనాకపూర్ నేటితరం పోటీలో అమ్మాయిలు ఆత్మవిశ్వాసం, అందం వంటి విషయాలలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? సినీ పరిశ్రమకు రావాలంటే ఏయో విషయాలలో స్ధిరంగా ఉండాలి? తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని తాను ఎలా బ్యాలెన్స్ చేసుకుంది? వంటి విషయాలపై విపులంగా మాట్లాడనుందట. మొత్తానికి కపూర్ హీరోయిన్ల ఫ్యాన్స్‌కి ఇది తీపి వార్తేనని చెప్పవచ్చు.