Advertisementt

ప్రియా వారియర్‌ కి వారూ పడిపోయారు!

Mon 19th Feb 2018 12:12 PM
rishi kapoor,regrets,priya prakash varrier,career  ప్రియా వారియర్‌ కి వారూ పడిపోయారు!
priya prakash varrier sensation continues ప్రియా వారియర్‌ కి వారూ పడిపోయారు!
Advertisement
Ads by CJ

ఒక్క కన్నుగీటులో దేశం దాటి కూడా ప్రియా వారియర్‌ నయా సెన్సేషన్‌గా మారింది. ఈ బ్యూటీకి యువత మొత్తం ఫిదా అవుతోంది. కేవలం చూపులు, హావభావాలు, కన్నుగీటుతో ఈమె గురించి కేవలం సౌత్‌ ఇండియన్‌ సినీ పరిశ్రమలే కాదు. బాలీవుడ్‌ ప్రముఖులు కూడా వాకబు చేస్తున్నారు. ఈమె గురించి బాలీవుడ్‌ లెజెండ్‌ రిషికపూర్‌ స్పందిస్తూ, ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ అమ్మాయి అంతులేని స్టార్‌డమ్‌ని సాధించుకోవడం ఖాయమని, ఎంతో అమాయకంగా కనిపించే ప్రియా, హావభావాలు మాత్రం అమోఘమని కొనియాడాడు. 'మైడియర్‌ ప్రియా.. రానున్న రోజుల్లో నువ్వు స్టార్‌వి కావడం, నీ ఏజ్‌ గ్రూప్‌ వారు నీకోసం తహతహలాడటం ఖాయమని' ట్వీట్‌ చేశాడు. ఆల్‌ది బెస్ట్‌. గాడ్‌ బ్లెస్‌ యు.. నీవు నేనున్న కాలంలో ఎందుకు రాలేదు.. అంటూ తనదైన శైలిలో కామెంట్‌ చేయడం విశేషం. 

మరోవైపు కోలీవుడ్‌, టాలీవుడ్‌ హీరో, లవర్‌బోయ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు సిద్ధార్ధ్ ఆమెకి విలువైన సూచనలు చేశాడు. ఆమెను ఐపిఎల్‌లో ఒక సీజన్‌తో అందరినీ అలరించి తర్వాత కనిపించకుండా పోయిన పాల్‌ వార్తాటిలా కావద్దని కోరాడు. ప్రియా వారియర్‌ ఐపిఎల్‌లో ఒక సీజన్‌లోనే కనిపించిన పాల్‌ వాల్తాటిలా పేరు తెచ్చుకుంది. వాల్తాటిలా ఒక సీజన్‌ సెన్సేషన్‌గా ప్రియా వారియర్‌ మారిపోకూడదు. ఆమె తన స్టార్‌డమ్‌ని కొనసాగించాలి. డెలికేట్‌ బ్యాలెన్స్‌తో, స్ధిరమైన పెర్ఫారెన్స్‌ని ఆమె కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ ఆమెకి విలువైన సూచనలు చేశాడు. సిద్దార్ద్‌ చెప్పిన దాంట్లో కూడా ఎంతో నిజం ఉందని ఒప్పుకోవాలి.

priya prakash varrier sensation continues:

Rishi Kapoor regrets why Priya Varrier was not there during his career

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ