Advertisementt

రవితేజ సినిమా రికార్డు బిజినెస్..!

Sun 18th Feb 2018 11:41 PM
ravi teja,kalyan krishna,movie,pre release  రవితేజ సినిమా రికార్డు బిజినెస్..!
Mind blowing pre-release business for Ravi Teja's next రవితేజ సినిమా రికార్డు బిజినెస్..!
Advertisement
Ads by CJ

రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకొచ్చిన రవితేజ టచ్ చేసి చూడుతో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. మరి టచ్ చేసి చూడు తర్వాత రవితేజ ప్లాప్ హీరోల లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. అయితే టచ్ చేసి చూడు తర్వాత రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని... దేనికి తగ్గడం లేదనే ప్రచారం జరిగింది. గతంలోనే రవితేజ నిర్మాతలకు చుక్కలు చూపించాడన్నారు. ఇప్పుడు టచ్ చేసి చూడు తర్వాత ఏమైనా డిమాండ్ తగ్గిస్తాడు అనుకుంటే... అబ్బే లేదు.. ఎప్పటిలాగే తన రెమ్యూనరేషన్ విషయంలో గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు.

ఇక టచ్ చేసి చూడు సినిమా తర్వాత రవితేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక మూవీ, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో మూవీకి కమిట్ అవడమే కాదు... కళ్యాణ్ కృష్ణ మూవీని అప్పుడే పట్టాలెక్కించేశాడు. మరి కళ్యాణ్ కృష్ణ కి సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు హిట్ ఉండడంతో ఇప్పుడు రవితేజకి కళ్యాణ్ కృష్ణ హిట్స్ అదృష్టం కలిసొచ్చినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే... టచ్ చేసి చూడు భారీ డిజాస్టర్ తో రవితేజ క్రేజ్ తగ్గినా కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా చెయ్యడం వలన టచ్ చేసి చూడు సినిమా రిజల్టుతో సంబంధం లేకుండా రవితేజ కొత్త సినిమాకు ఒక భారీ ఆఫర్ ఇచ్చారట సన్ టీవి వారు.

కళ్యాణ్ కృష్ణ - రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా శాటిలైట్ రైట్స్.... అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ కు గాను సన్ టీవీ వారు ఏకంగా 25 కోట్లు ఆఫర్ చేశారట. మరి రవితేజ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి డీల్ సెట్ అయితే సూపరే. మరి ఈ సినిమా నిర్మాత రామ్ తాళ్ళూరి వెంటనే డీల్ కి ఓకె చెప్పేస్తే బావుంటుంది. లేకపోతె సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేస్తే గనుక ఆ సినిమా టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా ఉన్నది.. ఉంచుకున్నది రెండు పోతుంది మరి.

Mind blowing pre-release business for Ravi Teja's next:

Ravi Teja and Kalyan Krishna Film Pre Release Business

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ