రోజు రోజుకి 'రంగస్థలం' సినిమాపై అంచనాలు ఎక్కువ అయిపోతున్నాయి. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ దగ్గర నుండి లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన ఎంత సక్కగున్నావే సాంగ్ వరకు ప్రతిదీ సినిమాపై విపరీతంగా అంచనాలను పెంచేస్తుంది. మార్చి 30న ఈ సినిమా విడుదల అవుతుంది. ఆ టైంలో పోటీకి ఇంకేమి సినిమాలు లేవు. దీనిబట్టి చూసుకుంటే ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వస్తాయనే అంచనా నెలకొంది.
అయితే కథ గురించి రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇది పూర్తిగా గ్రామీణ నేపధ్యంలో సాగే సినిమా అనేది క్లారిటీ వచ్చేసింది కాబట్టి అసలు పాయింట్ ఏమై ఉంటుందా అనే దాని గురించి ఏవేవో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పల్లెటూరి రాజకీయాలతో పాటు కోడి పందాలు కూడా వున్నాయి అని తెలుస్తుంది. చిట్టి బాబు - రామలక్ష్మి లవ్ స్టోరీ సినిమాకు హైలైట్ కానుందట.
1985 నాటి చిత్రం కాబట్టి ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రిఫరెన్స్ కూడా ఇందులో ఉంటుందని తెలిసింది. ఈ లెక్కన అన్ని వర్గాలని సుకుమార్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.