Advertisementt

ప్రభాస్‌, నితిన్‌ ల పెళ్లి తర్వాతేనంట..!

Sun 18th Feb 2018 08:13 PM
varun tej,marriage,prabhas,nithin,inspired  ప్రభాస్‌, నితిన్‌ ల పెళ్లి తర్వాతేనంట..!
Mega Prince Varun Tej in footsteps of Prabhas Without Marriage ప్రభాస్‌, నితిన్‌ ల పెళ్లి తర్వాతేనంట..!
Advertisement
Ads by CJ

'కంచె'తో మంచి నటునిగా గుర్తింపు తెచ్చుకుని, 'ఫిదా'తో అందరినీ ఆకట్టుకుని, తాజాగా వెంకీ అట్లూరి అనే నూతన దర్శకునితో బి.విఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'తొలిప్రేమ' ద్వారా మెగా హీరో వరుణ్‌తేజ్‌ వరుసగా రెండో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. 'అజ్ఞాతవాసి'ని డిస్ట్రిబ్యూట్‌ చేసి తీవ్ర నష్టాల పాలైన దిల్‌రాజుకి 'తొలి ప్రేమ' చిత్రం భారీ లాభాలను అందించడం ఖాయంగా కనిపిస్తోంది. అలా బాబాయ్‌ వల్ల వచ్చిన అప్పులను అబ్బాయ్‌ తీర్చేశాడనే చెప్పాలి. ఇక సాధారణంగా సినిమాలో ఏదైనా హైలైట్‌ సీన్‌ ఉంటే ముందుగా టీజర్‌, ట్రైలర్‌, పోస్టర్స్‌లో వాటినే చూపి ప్రమోషన్స్‌ చేస్తుంటారు. ఈ విషయంలో 'అర్జున్‌రెడ్డి' ఎంత లాభాలను పొందిందో అందరికీ తెలిసిందే. 

కానీ సినిమాకి విడుదల ముందు వరకు వరుణ్‌తేజ్‌-రాశిఖన్నాల మధ్య ఉండే లిప్‌ లాక్‌ సీన్‌ని పోస్టర్స్‌ ద్వారా కూడా హైలైట్‌ చేయని ఈ చిత్రం యూనిట్‌ తాజాగా ఈ పోస్టర్‌ని విడుదల చేసింది. అంటే ఇంకా చిత్రం చూడని వారికి, చూసిన వారికి కూడా మరోసారి గేలం వేయడానికే ఈ స్టిల్‌ని ఇప్పుడు రిలీజ్‌ చేశారని అంటున్నారు. మొత్తం మీద ఈ చిత్రం యూనిట్‌ రిజల్ట్‌ పట్ల ఎంతో ఆనందంగా ఉంది. వరుణ్‌తేజ్‌ కూడా ఉత్సాహంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా మీ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్న ఎదురైంది. 

దాంతో మెగాహీరో కూడా ఎంతో లౌక్యంగా తనకంటే వయసులో పెద్దయిన ప్రభాస్‌, నితిన్‌లు వివాహం చేసుకున్న తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని, అమ్మాయి దొరికితే చెప్పే చేసుకుంటానని అన్నాడు. ఇక వరుణ్‌తేజ్‌ తన తదుపరి చిత్రంగా 'ఘాజీ' దర్శకుడు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సైన్స్‌ఫిక్షన్‌ అందునా స్పేస్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేయనున్నాడు. దీని కోసం జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకునేందుకు ఆయన త్వరలో విదేశాలకు వెళ్లి శిక్షణ పొందనున్నాడు.

Mega Prince Varun Tej in footsteps of Prabhas Without Marriage:

Mega Prince Varun Tej inspired From Prabhas and Nithin for Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ