ఉత్తరాది నుంచి వచ్చే భామలు మొదటి టార్గెట్ టాలీవుడ్. ఇక్కడ కాస్త పేరు వచ్చిందంటే బిషానా బాలీవుడ్‌కి మార్చేసి, మన సినిమాల గురించి, దర్శక హీరోల గురించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. ఈ కోవలోకే చేరిపోయింది ఢిల్లీ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్. ఇక్కడ మహా అయితే రెండు మూడు ప్రెస్‌మీట్లు, ఆడియో, ప్రీరిలీజ్, సక్సెస్ మీట్‌లలో పొదుపుగా కనిపిస్తూ కనిపిద్దామా? సినిమాని ప్రమోట్ చేద్దామా? వద్దా? అన్నంత డైలమాగా వ్యవహరిస్తూ వస్తుంటారు. అదే బాలీవుడ్ తలుపు తడితే చాలు కాజల్, తాప్సి, ఇక గోవాకి చెందిన ఇలియానాలు మాత్రం హిందీ చిత్రాల కోసం దేశంలోని మూలమూలలు, ఇంకా అవకాశం ఉంటే విదేశాలు కూడా తిరిగి ఆడిపాడేస్తుంటారు.
ఇక రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన 'అయ్యారీ' చిత్రం తాజాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇండియన్ మిలటరీ ప్రాంతాలన్నీ స్వయంగా తిరిగిన రకుల్, సిద్దార్ద్ మల్హోత్రాలు ఢిల్లీలోని ఓ కాలేజీకి వెళ్లారు. అక్కడ విద్యార్దులు రకుల్, సిద్దార్ద్‌లు కలిసి డ్యాన్స్ చేయాలని పట్టుబట్టారు. దాంతో వీరిద్దరు కలిసి ఈ చిత్రంలోని 'లేయ్‌డూబా' పాటకు డ్యాన్స్‌లు చేశారు. డ్యాన్స్‌లో భాగంగా తనని పైకి ఎత్తుకోమని చెప్పిన రకుల్ సిద్దార్ద్ పైకి ఎత్తిపట్టుకోవడానికి కావాల్సిన కో ఆపరేషన్‌ని అద్భుతంగా ఇచ్చింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా విడుదలైన 'అయ్యారీ' చిత్రం దేశభక్తి, మన సైనికుల తెలివితేటలను అద్భుతంగా ఆవిష్కరించిందని, దర్శకుడు నీరజ్‌పాండే ఎంతో బాగా చిత్రాన్ని తీశాడని ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ మన చిత్రాలలో దేశభక్తి, ముఖ్యంగా మన సైనికులను గొప్పగా చూపించే చిత్రాలను పాకిస్తాన్‌లో విడుదల కానివ్వరు. ఇంతకు ముందు నీరజ్‌పాండే తీసిన 'బేబీ, నామ్‌షబానా' చిత్రాలలో కూడా దేశభక్తి ఉండటంతో పాకిస్థాన్‌లో విడుదల కానివ్వలేదు. ఇప్పుడు 'అయ్యారీ'కి కూడా అదే పరిస్థితి ఎదురైంది.