సినిమా రంగంలో వీన్‌స్టన్ వంటి హాలీవుడ్ నిర్మాత నుంచి మన దేశంలో బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ అనే తేడా లేకుండా పలువురు నటీమణలు కాస్టింగ్ కౌచ్ గురించి గళం ఎత్తుతున్నారు. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఛాన్స్‌లిస్తారని భావించి లైంగికంగా వారి ముచ్చట్లు తీర్చడానికి సిద్దమయ్యే నటీమణులు కూడా ఉన్నారు. సినిమాలో అవకాశం ఇవ్వకపోయినా ఫర్వాలేదు గానీ లైంగికంగా ఇబ్బంది పెడితే ఒప్పుకోమని ధైర్యంగా చెప్పేవారు తక్కువగానే కనిపిస్తారు. మగాళ్ల బలహీనతల మీద దెబ్బకొట్టి అవకాశాలు సాధించేవారు... పెద్ద నటీమణులుగా మారి, ఆ తర్వాత ఫేడవుట్ అయ్యే దశలో తాము వ్యభిచారం చేయడమే కాకుండా కొత్త అమ్మాయిలను కూడా తమకున్న పరిచయాలతో దర్శక నిర్మాతలు, హీరోల ద్వారా చాన్స్‌లు ఇప్పిస్తామని చెప్పి ముగ్గులోకి దించే తారా చౌదరితో పాటు భువనేశ్వరి, సీత, వ్యాంప్ జ్యోతి వంటి వారు కూడా ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అందాలను ఎరగా వేసి పెద్ద పెద్ద వారిని కూడా మస్కా కొట్టించే లేడీ కిలాడీలకు కూడా కొదువలేదు.
తాజాగా ఇదే అభిప్రాయాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత ఏక్తాకపూర్ కూడా వెల్లడించింది. సినిమాల సాకుతో చాన్స్‌లు ఇస్తామని చెప్పి లైంగిక అకృత్యాలకు పాల్పడే వారు ఉన్నట్లే ఇండస్ట్రీలో చాన్స్‌ల కోసం అదే లైంగికతను పణంగా పెట్టేవారు అంత కంటే ఎక్కువ మందే ఉన్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ లైంగిక వేధింపుల మీద చర్చ సాగిన ప్రతిసారి కేవలం బలవంతుల మీద, పలుకుబడి, శాసించే స్థాయి ఉన్నవారిపైనే ఆ నెపాన్ని నెట్టడం సరికాదని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి వారి దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు. కానీ చాన్స్‌లు రావడమే ముఖ్యమని భావించి, లైంగికతను పణంగా పెట్టిన వారిని చాలా మందినే చూశాను. అయితే అది వారి వ్యక్తిగత విషయమే అయినా అది బయటకు వచ్చినప్పుడు మాత్రం పెద్దలు, పలుకుబడి, డబ్బు ఉన్న వారినే దోషులుగా చూపించి, అలాంటివి లేని వారినే బాధితులుగా మార్చడం ఎంత వరకు సమంజసం?
ఉదాహరణకు ఓ హీరోయిన్ రాత్రి 2 గంటలప్పుడు నిర్మాతలు, దర్శకుల వద్దకు ఎందుకు వెళ్తుంది? కేవలం అవకాశం కోసమే వెళుతుంది. కానీ ఆ దర్శక నిర్మాతలు పర్సనల్ లైఫ్‌ని విడిగా, ప్రొఫెషనల్ లైఫ్‌ని విడివిడిగా చూసి ఆ నటి తన పాత్రకు సరిపోదని పెట్టుకోకపోతే ఆ తప్పుకు బాధ్యులు ఎవరు? కేవలం పైస్థాయి వారే అడ్వాంటేజ్ తీసుకుంటారని ముందుగానే భావించడం తప్పు అని ఆమె కుండబద్దలు కొట్టింది. ఇందులో చాలా శాతం నిజమేనని ఒప్పుకోవాలి.