Advertisementt

'తొలిప్రేమ'తో దశతిరిగింది... !

Sun 18th Feb 2018 12:37 PM
rashi khanna,nithin,dil raju,srinivasa kalyanam  'తొలిప్రేమ'తో దశతిరిగింది... !
Rashi Khanna in Srinivasa Kalyanam 'తొలిప్రేమ'తో దశతిరిగింది... !
Advertisement
Ads by CJ

క్యూట్‌ అందాలతో, లావుగా బొద్దుగా, బబ్లీ పాత్రలు చేస్తూ వచ్చిన హీరోయిన్‌ రాశిఖన్నా. ఈమెకి అదే తరహా పాత్రలు వస్తూ ఉండటంతో పాటు 'జై లవకుశ'తో ఫర్వాలేదనిపించినా తర్వాత వచ్చిన 'ఆక్సిజన్‌, టచ్‌ చేసి చూడు' చిత్రాలు ఆమె కెరీర్‌కి పెద్ద డ్యామేజ్‌నే కలిగించాయి. కానీ ఈమె మొదటి చిత్రం 'ఊహలు గుసగుసలాడే' చూసిన తర్వాత కొత్త అమ్మాయిని తీసుకుందామని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పినా వరుణ్‌తేజ్‌, నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌లు మాత్రం ఆమె 'తొలి ప్రేమ' చిత్రంలోని ప్రేయసి పాత్రను పండించగలదని గట్టిగా నమ్మారు. అనేక వేరియేషన్స్‌ ఉన్న పాత్ర కావడం, కాస్త హార్ట్‌ టచింగ్‌ సీన్స్‌తోపాటు మెచ్యూరిటీగా ఉండాల్సిన పాత్రను ఆమె చేసి మెప్పించగలదా? అని ఏకంగా దిల్‌రాజు వంటి నిర్మాతే భయపడ్డానని చెప్పుకొచ్చాడు. 

చిరంజీవిలో కూడా ఇదే ఉద్దేశ్యం ఉన్నట్లు అర్ధమైంది. అయితే ఈమె మాత్రం కాస్త నాజూకుగా మారి వరుణ్‌తేజ్‌లో కెమిస్ట్రీని అద్భుతంగా పడించి, లిప్‌లాక్‌లు కూడా ఇచ్చేసి, మంచి రొమాంటిక్‌గా నటించింది. దీంతో ఈమె ఇమేజ్‌ ఓవర్‌నైట్‌ మారిపోయింది. ఇప్పుడు ఈమెకి నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా వస్తున్నాయి. ఇక తాజాగా ఈమెకి దిల్‌రాజు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని సమాచారం. దిల్‌రాజు త్వరలో నితిన్‌ హీరోగా సతీష్‌ వేగ్నేష్‌ దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' నిర్మించనున్నాడు. ఇందులో మొదటగా 'కిర్రాక్‌పార్టీ' ఒరిజినల్‌ వెర్షన్‌లో నటించి, 'ఛలో'తో మెప్పించిన రష్మిక మండన్నాను నితిన్‌కి జోడీగా పెట్టుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రకి తాజాగా రాశిఖన్నాను సెట్‌ చేసుకున్నారని సమాచారం. 

మరి ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుగా రాశిఖన్నా, రష్మిక మండన.. ఇద్దరు నటిస్తారా? లేక రాశిఖన్నానే ఉంటుందా? అనేది తెలియాల్సివుంది. సతీష్‌ వేగ్నేష్‌, దిల్‌రాజులు 'శతమానం భవతి' ద్వారా అనుపమ పరమేశ్వరన్‌కి మంచి పేరు తెచ్చి పెట్టారు. మరి రాశిఖన్నా కూడా వీరి చేతుల్లో పడిందంటే ఇక మిగిలిన యంగ్‌ స్టార్స్‌తో నటించడమే తరువాయి అని చెప్పవచ్చు. 

Rashi Khanna in Srinivasa Kalyanam:

Rashi Khanna too keen to romance Nithiin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ