పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, సినీ క్రిటిక్‌గా చెప్పుకునే అపర మేధావి కత్తి మహేష్‌కి ఈ మధ్య జరిగిన గొడవ దాదాపు మూడు నాలుగు నెలల పాటు కంటిన్యూగా జరిగింది. చివరకు ఎలాగోలా సమస్య సద్దుమణిగింది. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడంలో పవన్‌కళ్యాణ్, కోనవెంకట్‌లు చొరవ చూపారు. కానీ తాజాగా కత్తి మహేష్ పవన్ ఏర్పాటు చేసిన 'జెఎఫ్‌సి' కమిటీని 'జస్ట్ ఫర్ ఫన్ కమిటి' అని సెటైరు వేసి లోగోని పోస్ట్ చేశాడు. మరోవైపు ఉండవల్లి అరుణ్‌కుమార్ పని లేని రిటైర్ అయిన టీచర్ అయితే పవన్ పనిలేని అమాయకపు స్టూడెంట్ అంటూ మాటలు పేల్చాడు. కత్తిమహేష్ నిజంగా పవన్ ఏదో మాయ చేస్తుంటే లేదా ఏదో తప్పు చేస్తుంటే విమర్శలు చేయవచ్చు. కానీ మంచి పని చేయాలని ఏర్పాటు చేసిన 'జెఎఫ్‌సి'ని కూడా ఎగతాళి చేయడం సమంజసం కాదు.
ఇక ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ్‌లు దేశంలోనే అత్యంత మేధావుల్లో ఒకరు. కానీ కత్తి వారిని కూడా విమర్శించడం సరికాదు. మరి అంత తెలివి తేటలు, ఫాలోయింగ్ ఉంటే కత్తి మహేష్ చేతల్లో చూపించాలి గానీ మాటలతో కాదు. వితండంగా మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడుతారు. సెటైర్ వేయడానికి కూడా సమయం సందర్భం తెలియని కత్తిమహేష్ మరి ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల గందరగోళంలో ఏమైనా పరిజ్ఞానం ఉంటే చర్చకు ముందుకు రావాలి. ఇక ఈయన తాజాగా మరో కుల విమర్శ చేశాడు. అసలు కులాన్ని సామాజిక వర్గం అని సంబోధించాలని తెలియని కత్తిమహేష్ కాపులు... నాయుళ్ల పిల్లలారా... మీరు పవన్‌ని నమ్మేటప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవి మీకందరికీ చేసిన ద్రోహం గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. సినిమాలలోనూ, రాజకీయాలోనూ చిరంజీవి మీకు చేసింది ఏమీ లేదు... అంటూనే మీ అసలైన నాయకుడు ముద్రగడ పద్మనాభమేనని చెప్పడం కాపులని విడదీసే కుట్రలో, వైసీపీ రూపంలో ఉన్న వ్యక్తిగా కత్తిమహేష్ స్వరూపం మనకి నిసిగ్గుగా కనిపిస్తోంది.
ఇలాంటి కాపుల్లారా.. నాయుళ్లారా.. అని కులం పేరు పెట్టి పిలవడం ఎంత తప్పో దళిత మేధావి అయిన కత్తి మహేష్‌కి బాగానే తెలుసు. ఇలా మోటు సామెత కావాలంటే చాలానే ఉన్నాయి. నల్ల బ్రాహ్మణుడిని నమ్మకూడదు. కమ్మోడిని కాటి కెళ్లినా నమ్మకూడదు. కాపు నీసు కడిగినా పోదు. మాలోడికి ఉంటే పొగరు. మాదిగోడికి తింటే పొగరు. చదువుకున్న వాడి కన్నా చాకలోడు మేలు.. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది.. వంటి కులాల పేరుతో ఎన్నో సామెతలు ఉన్నాయి. ఏ కులమైనా సరే కులాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యలు చేయడం కత్తి మహేష్‌కి సమంజసమా? ఆయన తననేమైనా అంటే దళితుడిని అని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పెడుతున్నాడు. ఈయన కూడా వైసీపీ వలలో పడి ప్రొఫెసర్ ఐలయ్యలాగా తనను తాను మేధావిని అని నిరూపించే క్రమంలో 'కోమట్లు సామాజిక స్మగ్లర్లు' అనే వ్యాఖ్యల టైప్‌లోనే కత్తి మహేష్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయని అర్ధమవుతోంది. పెద్దలు చెప్పినట్లు 'చదువుకున్న వాడికంటే చాకలోడుమేలు' అనే సామెత మేధావి అయిన కత్తిమహేష్‌కి బాగా సూట్ అవుతుంది.